YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఐఐటి విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

ఐఐటి విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

హైద‌రాబాద్‌, ఆగ‌ష్టు 10 
వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని ఐఐటీలో ర్యాంకు సాధించిన అంజలి తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తనకు సహాయం అందించాల్సిందిగా మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.అప్పుడు వెంటనే స్పందించిన మంత్రి కే తారకరామారావు గత సంవత్సరం సైతం ఫీజుల నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం అందించారు. అంజలి తండ్రి రమేష్ ఆటో డ్రైవర్ కావడంతో పూర్తి ఐ ఐ టి విద్య కోసం అవసరమైన నిధులను వ్యక్తిగతంగా  అందజేస్తానని మంత్రి గత ఏడాది హామీ ఇచ్చారు. ఆ మేరకు అంజలి రెండవ సంవత్సరానికి సంబంధించిన ఖర్చులను  ఈ రోజు ప్రగతిభవన్లో అంజలికి అందజేశారు. మంత్రి కేటీఆర్ అందించిన చేయూత పట్ల ఆయనకు ధన్యవాదాలు తెలిపింది అంజలి కుటుంబం.

Related Posts