YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వం అనుమతి ఇస్తే .. ఉచితంగా ఇళ్లను నిర్మిస్తాం

ప్రభుత్వం అనుమతి ఇస్తే .. ఉచితంగా ఇళ్లను నిర్మిస్తాం

విజయవాడ ఆగ‌ష్టు 10 
నిరు పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇళ్ల స్థలాలను ఇవ్వనుందని, తమకు ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆస్థలంలో చక్కటి ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నామని ఆశ్రయమ్ ప్రాజెక్టు సిఇఓ, కొండూరు ఆర్కా గ్రూప్ ఆఫ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యటివ్ అరుణ్ భవానీ కొండూర్ అన్నారు. విజయవాడలోని ఓ హెూటల్ లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రయమ్ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు ఎన్నో ప్రెస్టీజియస్ నిర్మాణాలు పూర్తిచేసినట్లు తెలిపారు. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో సుమారు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారని, తమ కంపెనీ ఆధ్వర్యంలో ఆస్థలాలలో అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి డిజైన్ ను ముఖ్యమంత్రికి, సంబంధిత మంత్రులకు తెలియచేయనున్నట్లు తెలిపారు. తాము నిర్మించనున్న ఇళ్లకు 'వైఎస్ఆర్ గృహనిర్మాణ్' పేరుతో ఆకృతి నమూనాను పత్రికలకు విడుదల చేశారు. తాము రూపొందించిన నమూనాను ముఖ్యమంత్రి పరిశీలించి అనుమతి ఇస్తే ఎంతో మంది పేద వారికి లబ్ది చేకూరుతుందని దీనికి ప్రభుత్వం కాని, లబ్ధిదారులు కాని ఎటువంటి డబ్లులు కట్టవలసిన అవసరం లేదని కేవలం 400 చదరపు అడుగులలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లును నిర్మిస్తామని తెలిపారు. అనువైన స్థలాన్ని తమకు కేటాయిస్తే చాలని, ప్రయివేటు స్థలం అయితే 80 శాతం వారికి ఇచ్చి, కేవలం 20శాతం తీసుకుంటామన్నారు. తాము నిర్మించే కాలనీలలో ఆసుపత్రితో పాటు ఆటస్థలం,తో పాటు పాఠశాలను కూడా అక్కడే నిర్మించే విధంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. ఇవేకాకుండా తమ ఫ్యూచర్ ప్రాజెక్టులలో అమరావతిలో టూరిజం విలేజ్ ను కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడైనా బీడు భూములు ఇచ్చినా అభివృద్ధి చేస్తామని చేస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని తెలిపారు. టూరిజం విలేజ్ లో అన్ని రకాలైన సదుపాయాలు ఉంటాయని తెలిపారు. అలాగే తమ ప్రాజెక్టు ఆధ్వర్యంలోనే 'స్పోర్ట్ అకాడమి' కూడా నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలియచేశారు. దేశంలోనే ప్రముఖ క్రికెట్ అకాడమి సచిన్ టెండూల్కర్ అకాడమితో తాము భాగస్వామ్యం చేసుకుని స్పోర్ట్ అకాడమిలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో తమ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 5 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. తాము నిర్మించే పాలిహౌస్, టూరిజం విలేజ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
 

Related Posts