YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు

గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు

అమరావతి ఆగ‌ష్టు 10 
 

గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు  నిర్దేశిత సమయం లోగా వినతుల పరిష్కారంపై పర్యవేక్షణ  దీని కోసం ప్రత్యేక కాల్ సెంటర్
పర్సుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) కాల్ సెంటర్ ప్రారంభించిన సీఎం జగన్  గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. సామాజిక తనిఖీ మార్గదర్శకాలను జగన్ విడుదల చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పీఎంయూ కాల్ సెంటర్ను జగన్ ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, గ్రామ, వార్డు సచివాలయాల ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మారుమూల ప్రాంతాల్లోని సచివాలయాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అయన ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వార్డు సచివాలయాల నిర్మాణం, అర్బన్ హెల్త్ క్లినిక్స్ పై దృష్టి పెట్టాలని అయన అన్నారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సెప్టెంబరు లోగా పరీక్షల ప్రక్రియ ముగియాలి. ప్రభుత్వ కార్యక్రమాల మీద గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. సచివాలయాల్లోని ఉద్యోగులకు, వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన ఉండాలని అయన అన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా ఇళ్లపట్టాలలు ఇచ్చేందుకు 90 రోజుల సమయం పెట్టుకున్నా.. ఒక నెలలో వచ్చిన దరఖాస్తులను అదే నెలలో పరిష్కరించుకుని యాక్షన్ ప్లాన్కు సన్నద్ధం కావాలన్నారు. నిర్ణీత సమయంలోగా దరఖాస్తు పరిష్కారం కాకపోతే కారణం ఏంటనేది ముఖ్యమంత్రి కార్యాలయానికీ రావాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సెంటర్ల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అంగీకరించదని అధికారులు వెల్లడించారు. ల్యాండు రెవిన్యూ రికార్డుల ప్రక్షాళనకు ఒక షెడ్యూల్ ప్రకటించాలని  సీఎం ఆదేశించారు.

Related Posts