YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు

సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు

హైదరాబాద్ ఆగ‌ష్టు 10 
సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్  370 వ జయంతి ఈ నెల 18 న పురస్కరించుకోని జాతీయ వారోత్సవాలను ప్రారంబించటం ఎంతో అనందంగా వుంది. ఈ కార్యక్రమాన్ని గత 14 సంవత్సరాలుగా జై గౌడ్ ఉద్యమం ఆద్వర్యంలో నిర్వహిస్తున్నందకు అభినందనలు తెలిపారు రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి  . శ్రీనివాస్ గౌడ్.  
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్  నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జన్మించిన ప్రముఖులు, రాజులు, వైతాళీకులు, పండీతులు, సాహితివేత్తలు, కవులు, చరిత్ర పురుషులు, మహానీయులను గుర్తించి వారి చరిత్ర , సాంస్కృతి మరియు వారసత్వాన్ని, అశయాలను కోనసాగిస్తూ వారి జన్మదినం మరియు వర్థంతులను ఘనంగా నిర్వహిస్తూ, గౌరవిస్తూ ప్రభుత్వం తరుపున  కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్  370 క్రీతం బడుగు , బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని సాధించి చూపించిన గొప్ప చక్రవర్తి గా అభివర్ణించారు. పాపన్న గౌడ్ ఒక్క గౌడ సామాజిక వర్గానికే కాక బడుగు, బలహీన వర్గాలను ఐక్యం చేసి రాజ్యాదికారం వైపు నడిపించిన గోప్ప సామాజిక స్పూర్తి ప్రధాత అని పేర్కోన్నారు. తెలంగాణ చరిత్ర అంటేనే సామాన్యుల చరిత్ర అన్నారు. చీమలన్నీ కలసి కోండ చిలువను ఓడించినట్లు సకలజనులు, సబ్బండ వర్గాల ప్రజలందరూ మా నాయకుడు  కెసిఆర్  నాయకత్వంలో ముందుకురికారు...తెలంగాణ ను సాధించారన్నారు.
సామాన్య కల్లు గీత కార్మికుని నుండి చక్రవర్తి వరకు ఎదిగి డిల్లీ పాలకులను ఎదిరించిన వీరుడున్నారు. ఖిలాషాపురం  , జాఫర్ ఘడ్, భువనగిరి, తాటికోండ, వరంగల్, సర్వాయి పేట కోటలను నిర్మించటం తో పాటు చారిత్రాత్మక గోల్కోండ కోటను ఆక్రమించి ధర్మ పరిపాలన చేసిన బహుజన చక్రవర్తి. చత్రపతి శివాజీ మహారాజ్ కు సమకాలీకుడిగా పరిపాలన చేసిన చక్రవర్తి గా చరిత్ర లో కీర్తి ఘటించారు. కానీ పాపన్న చరిత్ర ను కోందరు మరుగున పడేశారన్నారు.
సర్వమతాలను ఆదరించిన ధర్మ పాలనచేసారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్వాయి పాపన్న మహారాజ్ చరిత్రను నిర్లక్ష్యం చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సి ఎం కెసిఆర్ గారి అదేశాల మేరకు వారి చారిత్రక కట్టడాలను, కోటలను సంరక్షించి వాటిని పర్యాటక మరియు పురావస్తు శాఖ కేంద్రాలుగా అభివృద్ది చేస్తున్నామని మంత్రి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఖిలాషాపూర్, జాఫర్ ఘడ్ మరియు భువనగిరి కోటలను పర్యాటకంగా నిధులన కేటాయించి అభివృద్ది చేస్తున్నామన్నారు. ఇటివల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్వాయి పేట మండలం లోని సైదాపూర్ లో సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ నిర్మించిన కోటలను గ్రానైట్ మాఫియా ఆక్రమించుకోని బ్లాస్టింగ్ చేస్తుంటే అడ్డుకోని వాటి లైసన్సులను రద్దు చేయడం తో పాటు కోటలను సంరక్షించి వాటిని భవిష్యత్ తరాలకు చరిత్ర అందించేందుకు పర్యాటకంగా అభివృద్ది చేస్తున్నామన్నారు.
సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్  చరిత్ర ను ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ మరియు లండన్ లోని విక్టోరియా ఆండ్ ఆల్బర్ట్ మ్యూజియం లో భద్రపరిచారు. చరిత్ర తో పాటు శాశ్వత శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాపన్న గౌడ్ కు ప్రపంచ ఖ్యాతి దక్కించేవిధంగా కృషి చేసారు. వారి స్పూర్తి తో తెలంగాణ రాష్ట్రంలో పాపన్న చరిత్ర, అశయాలకు అనుగుణంగా సిఎం కెసిఆర్ గారు పరిపాలన అందిస్తున్నారన్నారు. అందులో భాగంగా బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ భవనాల కోసం కోన్ని వేల కోట్ల విలువైన భూములను కేటాయించారన్నారు. వీటితో పాటు వందల సంఖ్యలో గురుకులలాను స్థాపించి విధ్యా, సంక్షేమానికి మరియు అభివృద్దికి కృషిచేస్తున్నామన్నారు.
సర్వాయి పాపన్న గౌడ్  చరిత్ర ను ఖిలాషాపూర్ కు చెందిన ప్రోపెసర్. పేర్వారం జగన్నాథమ్ గారు ఇంగ్లాండ్ లో ఉన్న చరిత్రను తెలుగు ప్రజలకు చేరువ చేసారన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సి ఎం కేసిఆర్  ప్రత్యేక చోరువ తో పాపన్న గౌడ్ గారి జీవిత చరిత్ర ను ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో ఇప్పటికే 7 తరగతి సాంఘీక శాస్త్రంలో నమోదు చేసారు.
ఈ నెల 18 న సర్దార్ సర్వాయి పాపన్న   జన్మదినాన్ని పురస్కరించుకోని నిర్వహిస్తున్న జాతీయ వారోత్సవాలను తెలంగాణ రాష్ట్ర  వ్యాప్తంగా అని సామాజిక సంఘాలు, కుల సంఘాల అన్ని బౌతిక దూరం పాటిస్తూ ఘనంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. జాతీయ వారోత్సవాల ముగింపు రోజున రవీంద్ర భారతి లో కోవిడ్ నిబందనలు పాటిస్తూ కోద్ది మంది ముఖ్య నాయకులతో వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమము లో రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మెన్ బాద్మి శివకుమార్, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు  పల్లే లక్ష్మణ్ రావు , జై గౌడ్ ఉధ్యమము జాతీయ అధ్యక్షులు డా. వట్టికూర రామారావు, సాంస్కృతిక శాఖ సంచాలకులు  మామిడి హరికృష్ణ, జై గౌడ్ తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు  బూర మల్సూర్ గౌడ్, మోర్ల ఏడుకోండలు గౌడ్ లతో పాటు వివిధ గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గోన్నారు.

Related Posts