YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ప్రైవేట్ టీచర్స్ ని ఆదుకున్న విద్యార్థి

ప్రైవేట్ టీచర్స్ ని ఆదుకున్న విద్యార్థి

నల్గొండ  ఆగ‌ష్టు 10 
కరోనా కష్ట కాలంలో తనకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి అక్షయ హై స్కూల్, హాలియా నందు 5వ తరగతి చదువుతున్న  ఎక్కలూరి సాయి సాత్విక్ రెడ్డి, తన తండ్రి  ఎక్కలూరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ , హాలియా గారితో మాట్లాడి 21  మందికి నిత్యావసర సరుకులు  (ఒక్కొక్కరికి 25 కేజీల రైస్, కిరాణా సామాగ్రి, శానిటైజర్ మరియు మాస్క్) పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎక్కలూరి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ నేటికీ పాఠశాలలు పునఃప్రారంభం కానందున ప్రైవేట్ టీచర్స్ మనుగడ ను దృష్టిలో ఉంచుకొని తన కుమారుని కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలోని ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి తల్లిదండ్రులు ముందుకు వచ్చి పాఠశాలల్లోని ప్రైవేటు టీచర్స్ ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Related Posts