YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో మండుతున్న ఎండలు

 తెలంగాణలో మండుతున్న ఎండలు

రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 3 డిగ్రీల చొప్పున పెరుగుదల నమోదవుతోంది. ఫిబ్రవరి చివరి వారం నుంచే భానుడి భగభగలు మొదలవడంతో జనం ఇక్కట్లు పడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఎండల తీవ్రత నెమ్మదిగా పెరుగుతుండటంతో పాటు వడగాల్పులు మొదలయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.కొన్ని ప్రాంతాల్లో పగలు, రాత్రి మధ్య వ్యత్యాసం చాలా అధికంగా ఉంటోంది. ఆకాశంలో మేఘాలు లేనందున సూర్య కిరణాలు నేరుగా నేలను తాకుతుండడంతో భూ వాతావరణం త్వరగా వేడెక్కి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.న్నటిదాకా అకాల వర్షాలకు చల్లబడ్డ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేడిమికి బయపడి జనం రోడ్డెక్కాలంటెనే జంకుతున్నారు.ఉదయం 10 దాటిందంటే రోడ్లన్ని ని ర్మానుష్యంగా మారుతున్నాయి... జిల్లాలో పది రోజులుగా ఎండదెబ్బకు పలువురు మృతిచెందా రు. ప్రభుత్వం ముందు చూపుతో శాఖలను అప్రమత్తం చేసి ఎండ సమయంలో బయటకు వెళ్లవద్దని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. విరివిగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఎండల బారి న పడకుండా ఉండాలంటే వైద్యులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కొల్చారం పీ హెచ్‌సీ వైద్యాధికారి రమే శ్ వివరించారు.ఇటీవల వాతావరణంలో అనూహ్యమార్పులు చోటు చేసుకుంటున్నాయి... చెరువు, కుంటలు, బావుల్లో నీళ్లు లేకపోవడంతో అడవులు తరగడం వంటి చర్యలతో వాతావరణం వానకాలం వర్షా లు కురవకపోవడం, ఎండాకాలం మండే ఎండ లు... ఈ సారి ఎండవేడిమి 39-41డిగ్రీల మధ్య ఉంది. ఇంకా రెండు నెలల ఎండాకాలం మరింతగా ఊష్ణోగ్రతలు పెరుగనున్నాయి. ఈ సంవత్స రం మార్చి మాసాంతంలోనే యువకులు ఎండవేడిమిని తట్టుకోలేక, జీవనోపాధి కోసం ఎండలో తిరిగేవారు మృత్యువాత పడుతున్నారుఈ వేసవిలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో నిర్వహించారు. ఈ ఏడాది ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎండల తీవ్రతపై రంగుల గుర్తులతో సూచనలు చేయాలని, జిల్లాల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలని సూచించారు. తాగునీటి సమస్య ఏర్పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్మికులు ఎండలో పనిచేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Related Posts