YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిరిసిల్లకు 95 లక్షల చీరలు ఆర్డర్

సిరిసిల్లకు 95 లక్షల చీరలు ఆర్డర్

 సిరిసిల్ల జిల్లాలోని ర్మికులకు చేతినిండా ఏడాది పాటు పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్‌ను సిరిసిల్లకే అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు 95 లక్షల చీరలు కావాల్సి ఉండగా ప్రభుత్వం రూ.247 కోట్ల విలువ గల 7 కోట్ల మీటర్ల చీరలను తయారు చేయాలని కోరింది. ఇక్కడ ఉన్న 25 వేల మరమగ్గాలు 5 నెలల పాటు ప్రతిరోజు పనిచేస్తే గాని 95 లక్షల చీరలు తయారు చేయలేమని అధికారులు పేర్కొంటున్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్‌ కోసం కార్మికులు ఎదురుచూస్తుండగా ప్రస్తుతం ప్రభుత్వం 20 లక్షల చీరల తయారీకి ఆర్డర్‌ ఇచ్చింది. మరో 75 లక్షలకు మూడు రోజుల్లో ఆర్డర్‌ ఇవ్వనుంది. కలర్‌ చీర మీటరు తయారు చేస్తే రూ.6.50 వస్తుండగా కార్మికునికి రూ.3, ఆసామికి రూ.3.50 వస్తుంది. తెల్లచీరపై ప్రింట్‌తో తయారు చేస్తే ఒక్కో మీటర్‌కు రూ.5 వస్తుండగా కార్మికునికి రూ.2.15, ఆసామికి రూ.2.75 అందనుంది. బతుకమ్మ చీరలు కాక నిత్యం చేసే మరమగ్గాల పనిలో మీటరుకు యజమాని రూ.2.15 ఆసామికి ఇస్తే ఆసామి దాంట్లో నుంచి రూపాయి మీటరుకు కార్మికునికి ఇస్తుంటాడు. దీన్ని చూస్తే బతుకమ్మ చీర కార్మికుడికి భరోసా కల్పిస్తుందని చెప్పవచ్చు.ఈ సారి మూడు రకాల చీరలను తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వాటికి సంబంధించిన ముడిసరకు మార్కెట్లోకి వచ్చింది. గతంలో ఒక్కో చీర తయారీకి రూ.200 పడగా ఈ సారి జరీ, ప్రింటింగ్‌ ఉండటంతో ధర రూ.260 పడుతుంది. ప్రస్తుతానికి 20 లక్షల చీరల ఆర్డర్‌ మాత్రమే రావడంతో ఉత్పత్తిదారులు పూర్తిస్థాయిలో వచ్చాకే తయారీ ప్రారంభిస్తామని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే మిగితా ఆర్డర్‌ ఇచ్చినట్లయితే తయారీ ప్రారంభమై అనుకున్న సమయానికి కార్మికులు బతుకమ్మ చీరలను అందించే అవకాశాలున్నాయి.గతంలో జరిగిన అనుభవాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఆర్డర్‌ను పలు దఫాలుగా ఇచ్చేందుకు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 లక్షల చీరలు కావాల్సి ఉండగా ప్రభుత్వం మొదటి విడతగా 20 లక్షల చీరల ఆర్డర్‌ను ఇచ్చింది. సాంకేతికంగా మరమగ్గాలను చీరల జరీకి అనుగుణంగా ఆధునికీకరించుకోవాల్సి రావడంతో అదనంగా భారం పడుతుందని, దీంతో పూర్తి స్థాయిలో ఆర్డర్‌ వస్తేనే గిట్టుబాటు అవుతుందని ఉత్పత్తిదారులు పేర్కొంటున్నారు. అందుకే వారు తయారీని ఇంకా ప్రారంభించలేదు. మిగితా 75 లక్షల చీరలను మూడు రకాలుగా తయారు చేయాలని సర్కారు నిర్ణయించింది. గతంలో కంటే ఈసారి నూలు మంచిది వాడాలని యోచిస్తోంది. 40 లక్షల చీరల్లో మూడు రకాలు తయారు చేస్తున్నారు. అయిదున్నర మీటర్ల చీర జరీ బార్డర్‌తో 10 లక్షల చీరలు, 8.20 మీటర్లు చీర జరీ బార్డర్‌తో 20 లక్షల చీరలు, వివిధ రకాల చీరలు 20 లక్షలు, తెల్ల చీరలపై ప్రింటింగ్‌ చేసే చీరలు 55 లక్షలు తయారు చేయనున్నారు.

Related Posts