YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు కళలు తెలంగాణ

బయటపడ్డ 2200 నాటి శాసనాలు

బయటపడ్డ 2200 నాటి శాసనాలు

నిజామాబాద్, ఆగస్టు 11, 
తెలంగాణ చరిత్రకు సంబంధించి మరో ఆధారం 2,200 ఏళ్ల నాటి శాసనం లభించింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్‌తుమ్మెదలో క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటి లఘు శాసనం దొరికిందని పురావస్తు నిపుణుడు, బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్‌ ఎంఎ.శ్రీనివాస్‌ వెల్లడించారు. వై.భానుమూర్తి (చీఫ్‌ కేర్‌టేకర్‌ తెలంగాణ ప్రభుత్వ హెరిటేజ్‌ శాఖ), బి.శంకర్‌రెడ్డి (పురావస్తు అన్వేషకుడు)తో కలిసి మంజీరా నదీ పరివాహక ప్రాంతంలో జరుపుతున్న అన్వేషణలో తమకు ఈ శాసనం దొరికిందని ఆయన తెలిపారు. అశోక బ్రాహ్మీ లిపిలో, ప్రాకఅత భాషలో 5 అక్షరాలున్న ఈ శాసనం తొలి శాతవాహనుల కాలంనాటిదని అన్నారు. తుమ్మెద గ్రామసమీపంలోని చిన్నకొండపై ఉన్న బండపై కనుగొన్నామని అని వివరించారు. 'మాధవచంద' అని ఓ వ్యక్తి పేరు రాసిన ఈ శాసనం క్రీస్తుపూర్వం 2వ శతాబ్ధానిదిగా భారతీయ పురావస్తు శాఖ శాసన విభాగం డైరెక్టర్‌ ధ్రువీకరించారని అని పేర్కొన్నారు. ఆ కాలంలోనే ఈ ప్రాంతంలో జనావాసం ఉండేదని, నాగరికత విలసిల్లిందనడానికి శాసనం ఆధారంగా కనిపిస్తోందని చెప్పారు.తెలంగాణకు సంబంధించిన శాసనాల్లో ఇదే పురాతనమైందని ఎంఎ.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శాతవాహనుల కాలంనాటి పురావస్తు స్థలాలు కోటిలింగాల, ధూళికట్ట వంటి గ్రామాల్లో దొరికిన శాసనాల కాలంకంటే ఇదే పురాతనమైందన్నారు. తమ బఅందానికి ఇదే గ్రామంలో రాతియుగపు గుహ ఆవాసాలు, చిత్రాలు కూడా దొరికాయన్నారు.కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలంలోని మాల్‌ తుమ్మెద గ్రామంలో వెలుగు చూసిన 2200 ఏళ్ళనాటి బ్రాహ్మీ శాసనంపై రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కఅతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందించారు. తక్షణమే రాష్ట్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారుల బఅందం శాసనాలు లభించిన ప్రదేశాన్ని సందర్శించి సమగ్రమైన నివేదికను వారంరోజుల్లో తనకు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా ఆ ప్రదేశంలో ఇంకా ఏమైనా రాతి యుగపు ఆనవాళ్లు, చారిత్రక ఆధారాలు ఉంటే వాటిని వెంటనే భద్రపరచాలని రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులకు లిఖితపూర్వక ఆదేశాలు జారీచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాచీన చరిత్ర ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను వెలికితీయటంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ చరిత్ర, సంస్కఅతిపై పలు పరిశోధనలు జరుపుతున్నామన్నారు. అందులో భాగంగా హెరిటేజ్‌ తెలంగాణ (పురావస్తు శాఖ) కు, బుద్ధవనంకు చెందిన పురావస్తు నిపుణులు, కన్సల్టెంట్‌లు మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలో అన్వేషిస్తున్నారని అన్నారు

Related Posts