YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

. అంబెడ్కర్ ఆలోచనలను అమలు పరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది -అంబెడ్కర్ జయంతి ఉత్సవాలలో మంత్రి జగదీష్ రెడ్డి

. అంబెడ్కర్ ఆలోచనలను అమలు పరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి  కేసీఆర్ ది  -అంబెడ్కర్ జయంతి ఉత్సవాలలో మంత్రి జగదీష్ రెడ్డి

నివాళులు అర్పించడంఅంటేనే ఆ మహనీయుడి ఆలోచనలను అమలు పరచడమని రాష్ట్ర విద్యుత్, యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. శాంతియుతంగా ఉద్యమాలు చేసి స్వాంతంత్రాన్ని సాధించిన జాతిపిత మహాత్మ గాంధీ,నెల్సన్ మండేలా మార్గంలోనే రాజ్యాంగం ద్వారా సామాజిక అంతరాలను తొలగించ వచ్చని నిరూపించిన మహనీయుడు బి.ఆర్ అంబెడ్కర్ అని ఆయన కొనియాడారు. శనివారం ఉదయం ట్యాన్క్ బండ వద్ద జరిగిన డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ జయంతి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే యావత్ ప్రపంచానికే  భారతదేశము తలమానికంగా నిలిచిందన్నారు . భారతదేశము తో పాటు ఎన్నో దేశాలు స్వాతంత్రాన్ని సాదించుకున్నప్పటికీ అనేక దేశాలు అంతర్గత కొట్లాటలు ఉద్యమాలతో పాటు ఆయా దేశాలలో ఉండే సంస్కృతి సంప్రదాయాలు మధ్య ఉండే విభేదాలతో విడిపోయి బలహీన పడ్డాయన్నారు. ఇప్పటికి కూడా ఆయా దేశాల ప్రజలు సుఖసంతోషాలతో లేకుండా అలజడులకు లోనవుతున్న పరిస్థితులను మనం గమనిస్తున్నామని ఆయన చెప్పారు. 

వీటన్నిటికంటే ఎక్కువ వైరుధ్యాలు,విభిన్న సంస్కృతి సంప్రాదాయాలు ఉన్న ఈ దేశాన్ని గత 70 సంవత్సరాలుగా కలిపి ఒకే పద్దతిలో ప్రపంచం మొత్తంలో తల ఎత్తుకునే పరిస్థితిలు ఏర్పడ్దయంటే దానికి కారణం అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం మండంలో ఎటువంటి సందేహం లేదన్నారు. అంతే కాకుండా భవిష్యత్ లో దేశంలోని ఆయా ప్రాంతాలలో వారి వారి సంస్కృతి సంప్రాదయాలను పట్టి వారి వారి వనరులను వారి వారి  వాడుకునే పద్దతిలో ఆలోచనలు వస్తాయని ముందుగానే ఉహించి రాజ్యాంగంలో పొందు పరచిన మహనీయుడు బాబా సాహెబ్ అంబెడ్కర్ అని  అటువంటి మహనీయుడిని జాతి ఉన్నంత వరకు స్మరించుకుంటుందన్నారు. అందులో భాగంగానే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయిందన్న విషయాన్ని విస్మరించరాదన్నారు. ఇటువంటి అంశాలకు రాజ్యాంగంలో వెసులుబాటు కల్పిస్తూనే పెద్దవాళ్లు చిన్న వాళ్లను ... ఉన్నవాళ్లు లేనివాళ్లను అణిచివేసే అవకాశం ఉండొద్దని సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న మైనారిటిలకు రక్షణ కల్పించాలని గొప్ప ఆలోచనలు చేసిన ఘనత అంబేద్కర్  దక్కిందన్నారు.

Related Posts