YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మీరాబాయి(1498-1547) కృష్ణుని భక్తురాలు, గాయకురాలు

మీరాబాయి(1498-1547) కృష్ణుని భక్తురాలు, గాయకురాలు

మీరాబాయి(1498-1547) కృష్ణుని భక్తురాలు, గాయకురాలు. ఈమె ప్రార్థనా గీతాలు, భజనలు భారతదేశం అంతా ప్రాచుర్యం పొందాయి మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో ప్రచురించబడ్డాయి.
రాజపుత్ర యువరాణి మీరా వాయువ్య రాజస్థాన్లోని నాగపూర్ జిల్లాలో ఉన్న మెర్టా దగ్గరి చిన్న పల్లెటూరు కుడ్కీ (కుర్కీ) లో జన్మించింది ఆమె తండ్రి రతన్ సింగ్ రాథోడ్, రాథోడ్ వంశానికి చెందిన వీరుడు.
మీరా చిన్నతనంలో ఒక సాధువు ఇచ్చిన కృష్ణుడి విగ్రహాన్ని గాఢంగా మోహించింది, దీనిని ఆమె జీవితాంతం ఆమె దగ్గరే ఉంచుకుంది. ఆమె తల్లి ఆమె ఆధ్యాత్మిక భావనలకు మద్ధతునిచ్చేది కానీ ఆమె త్వరగా చనిపోయారు.
మీరా వివాహం ఆమె చిన్న వయస్సులోనే చిత్తోడ్ రాణా సంగా పెద్ద కొడుకు భోజ్ రాజ్ యువరాజుతో సాంప్రదాయబద్ధంగా నిశ్చయించబడింది. తరువాత వివాహం జరుగుతుంది. కానీ మీరాకు 20 సంవత్సరాలున్నప్పుడు ముస్లింలతో జరిగిన యుద్ధంలో ఆమె భర్త మరణిస్తాడు. మీరా. అశాశ్వతం నుంచి శాశ్వతాన్ని ప్రేమించడం నేర్చుకుంది, తన బాధని ఆధ్యాత్మిక భక్తిగా మలుచుకొని ఆ స్ఫూర్తితో లెక్కలేనన్ని పాటలని శృంగారం, విరహాల మేళవింపుతో రాసింది.
ఆమె కృష్ణభక్తలో మైమరచిపోయి పుర వీధులలో నాట్యం చేసేది. చిత్తోడ్ ఘడ్ క్రొత్త రాజు, ఆమె బావ విక్రమాదిత్య దుష్టస్వభావం గల యువకుడు, ఇతను మీరా పేరుని, ఆమె సామాన్యులతో కలవడాన్ని,
ఆమెకి విషమివ్వడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఒకానొక సమయంలో మీరా తనకి తాను గురు రవిదాస్ శిష్యరాలిగా ప్రకటించుకొని బృందావనానికి వెళ్ళిపోయింది. ఒకసారి ఆమె బృందావనంలో గురు సాధువు చైతన్య ప్రత్యక్ష అనుయాయి రూపా గోస్వామితో ఆధ్యాత్మిక విషయాలను గురించిన చర్చ జరపాలన్న కోరికను తెలియపర్చింది, ఘోటక బ్రహ్మచారి అయిన ఆయన ఒక స్త్రీని కలవడానికి నిరాకరించారు. దీనికి మీరా ఈ విశ్వంలో నిజమైన పురుషుడు కేవలం కృష్ణుడు మాత్రమే అని సమాధానమిస్తుంది.
ఆమె తన తీర్థయాత్రను కొనసాగిస్తూ "ఒక గ్రామంనుంచి ఇంకొక గ్రామానికి నాట్యం చేస్తూ వెళుతూ దాదాపు మొత్తం ఉత్తర భారతదేశాన్నంతా పర్వటిస్తుంది. ఆమె తన జీవిత చరమాంకంలో గుజరాత్ లోని ద్వారకకు చేరుకొని అక్కడ చివరిదాకా గడిపింది.
మీరా పాటలు సులభంగా ఉండి పాద (వర్స్) అని పిలువబడతాయి, ఈ పదం చిన్న ఆధ్యాత్మిక గీతానికి ఉపయోగిస్తారు, సాధారణంగా సులభ స్వరాలలో, పునరావృత పల్లవులతో స్వరీకరించబడతాయి, ఇవి ఆమె పదావళిలో సంకలనం చేయబడ్డాయి. నిజ ప్రతులు హిందీ రాజస్తానీ, బ్రజ్ మాండలికంలో ఉన్నాయి, ఈ హిందీ మాండలికం బృందావనం చుట్టుప్రక్కలా మాట్లాడతారు (కృష్ణుడి బాల్య గృహం), ఇవి ఒక్కోసారి రాజస్తాన్, గుజరాతితో కలుస్తుంది
 

Related Posts