సికింద్రాబాద్, ఆగష్టు 11
ఇటీవలి కాలంలో అత్యవస సందర్భాల్లో ఆక్సిజన్ సిలిండర్లు లభించకపోవడంతో కరోనా రోగులు, వ్యాధి లక్షణాలు కలిగిన వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి రావడంతో పాటు మృత్యువాత కూడా పడుతున్న పరిస్థితుల్లో తెరాస యువ నేత, తెలంగాణ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ ఓ విభిన్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అత్యవసర సందర్భాలలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారికీ ఆక్సిజన్ సీలిండర్లను పూర్తి ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు జరిపారు. ఈ మేరకు తన నివాసంలో ఆక్సిజన్ సీలిండర్లను తన సొంత డబ్బులతో సమకూర్చుకొని సిద్ధం చేసుకొని అత్యవసర సందర్భాల్లో రోగులకు ఈ ప్రాణ వాయువును ఉచితంగా అందించేలా ఏర్పాట్లు జరిపారు. ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ అందించే కార్యక్రమాన్ని శ్రీ తీగుళ్ల రామేశ్వర్ గౌడ్ మంగళవారం సికింద్రాబాదులోని తమ నివాసంలో పలువురు నాయకులతో కలిసి ప్రారంభించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు ఉచితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్ ను అందించేందుకు తాము సిద్ధంగా ఉంటామని, నేరుగా తమను మొబైల్ నెంబరు 99591 53855 ద్వారా సంప్రదించవచ్చునని అయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోగాజవర్గానికి సంబంధించిన అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సీతాఫలమండి, బౌద్ధనగర్ డివిజన్లకు సంబంధించిన వారెవరైనా అత్యవసరమైతే తాము అందించే సదుపాయాన్ని వినియోగించుకోవచ్చునని అయన తెలిపారు.