దళితులు అన్ని వర్గాలతో సమానంగా ఎదిగేందుకు అన్ని అవకాశాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా శాఖమూరులో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ఎస్సీ విద్యార్థుల విదేశీ చదువులకు ఇస్తున్న రూ.10లక్షలను రూ.15లక్షలకు పెంచుతున్నామన్నారు. రాష్ట్రానికి కేంద్రం తీరని ద్రోహం చేసిందన్నారు. పోరాటం తప్ప వేరే మార్గం లేదని ముందుకొచ్చానన్నారు. చరిత్రలో చాలామంది పుడతారు. అందరిలో ప్రముఖుడు అంబేద్కర్. ఎన్నో అసమానతలు ఉన్న రోజుల్లో అంబేద్కర్ పుట్టారు. వీటి అన్నింటినీ అధిగమించే ప్రయత్నం చేశారని అన్నారు. రాజ్యాంగం రచనా భారం మొత్తం అంబేద్కర్ ఒక్కరే చేశారు. అదీ ఆయన పట్టుదల. ఎన్ఠీఆర్ తమకు స్ఫూర్తి అంబేద్కర్ అని చెప్పారని అన్నారు.
పూలే, జగజీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఈ నెలలో మనం జరుపుకున్నాం. ఈ ముగ్గురు మహనీయులు. 100 కోట్ల తో 20 ఎకరాలలో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం ఉండేలా అంబేద్కర్ స్మ్రుతి వనం ఉంటుంది. 18 నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. ఎన్ఠీఆర్ హాయాం లో అంబేద్కర్ కి భారతరత్న వచ్చింది. టీడీపీ హాయాం లో నే దళితనాయకులకు న్యాయం జరిగింది. ఇన్ని సంవత్సరాలు అయ్యుంది ఇంకా అంటరాని తనం ఉంది. వీటి నిర్మూలనకు టీడీపీ కృషి చేస్తోందని అన్నారు. దళితనాయకులతో ఈ రోజు టీడీపీ ముందుకు నడుస్తుంది. షెద్యూల్డ్ కులాలు, గిరిజన కాలనీ ల అభివృద్ధి కి నేడు ఎంతో కృషి చేస్తోంది టీడీపీ. ప్రతిఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను అని చెప్పిన విధంగా చెప్పిన మాట ప్రకారం నిలబడ్డాననని అన్నారు. ఈ నెలలోనే పెళ్ళికానుక కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. జగజీవన్ జ్యోతి పేరిట విద్యుతు కాంతులు పంచుతున్నాం. పేదరికం అసమానతలు తొలగించేందుకు జీవితం మొత్తం పోరాడతానని అన్నారు. ప్రభుత్వం చేయూత నిస్తుంది. పేదరికం లేని సమాజం చూడటమే నా బాధ్యత. ఇంకా చాలా చేయాలి. పేద వారి కోసం 19 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తున్నాం. దళితతేజం ద్వారా మీ అందరికి అండగా ఉంటానని అన్నారు. ఇంకా నేను చేస్తూనే ఉంటాను, ఎస్సీ ఎస్టీ ల చదువుల కోసం 15 లక్షలు ఇస్తాం. చెప్పులు కుట్టే మాదిగలకు, డప్పు కళా కారులకు, ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకుంటున్నాం. దళితులపై అట్రాసిటీ జరగకూడదు అని ప్రభుత్వానికి లెటర్ వ్రాసాను. ఆయునప్పటికీ దళితులకు అండగా ఉంటానని అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా, 1. దళితులకు అన్ని విధాలా అండగా ఉంటాను, 2. సామాజికంగా వెనుకబడిన వర్గాలను దళిత క్రిస్టియన్ లకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించేలా చర్యలు తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి 10 వేల ఆదాయం నుండి 20 వేలు ,30వేలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. చదువుకునే పిల్లలకు 3 గుడ్లు నుండి 5 గుడ్లు కి పెంచాం. చదువుకునే పిల్లల పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ అందిస్తున్నాం. కాస్మొటిక్స్ చార్జీలు పెంచుతున్నాం. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగం. పొష్టికాహారం లేని కారణంగా పిల్లలు అనారోగ్యకారణాలతో ఉంటున్నారని అన్నారు. ఇటువంటి వారి కోసం 'బాల సంజీవని' కార్యక్రమం రూపొందిస్తాం. అన్ని అంగన్ వాడీ లో మెషిన్ పెడుతున్నాం. దాని ద్వారా అన్ని వివరాలు నా డాష్ బోర్డు కి వస్తాయి. బాలసంజీవని ని ఎప్పుడు కని పెట్టి ఉంటాం. భారత రాజ్యాంగం ని మార్చి దళిత క్రిస్టియన్ ల ఎస్సీ రిజర్వేషన్ కోసం ప్రభుత్వం తో పోరాడతామన్నారు. పిల్లలకందరికి అన్న ప్రాసన చేస్తాం. అందరికి ఆహరం అందుబాటులో ఉండాలి. పిల్లలకు పౌష్ఠికాహారం లోపం లేకుండా చూడాలి. నా మీద ఎన్నో తప్పుడు ఆలోచనలు చేస్తున్నారు.40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్నడు మీకు తప్పుడు పేరు తీసుకురాను. ఓ క్రమశిక్షణ, ప్రకారం పేదవాడు ఏ విధంగా బాగు పడతాడు అనే ఆలోచన తప్ప మరేమీ లేదు. కనీసం బీజేపీ అయినా మనకు న్యాయం చేస్తుంది అనుకున్నాను. కానీ అన్యాయం చేసింది. మోడీ కన్నా నేను ముందే సీఎం ని అయ్యానని గుర్తు చేసారు. నాకు భయమేమిటి? మీకోసం ఏమైనా చేస్తా, కానీ మానల్ని నమ్మక ద్రోహం చేశారు. తమిళనాడు లో పనికిరాని రాజకీయాలు చేశారు. అదే రాజకీయాలు ఆంధ్ర లో చేయాలని చూస్తున్నారని అయన విమర్శించారు.