కాకినాడ ఆగష్టు 11
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం గండేపల్లి గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో భక్తులకి తక్కువ సంఖ్యలో ప్రవేశాన్ని కల్పించారు. యాదవ సంఘం, శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు భక్తిి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామి వారికి నిర్వహించిన పూజ కార్యక్రమంలో మరుకుర్తి శ్రీను,జ్యోతి దంపతులు పీటల పై కూర్చుని వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా మామిడి తోరణాలతో పువ్వులతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం వారు మాట్లాడుతూ..గండేపల్లి గ్రామంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు 1977నుండి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈసారి కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించి సామాజిిక దూరం పాటిస్తూ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ఐదు రోజుల పాటు స్వామివారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు తెలిపారు..ఈ సందర్భంగా గండేపల్లి ఆలయ పురోహితులు మాట్లాడుతూ 1977 సంవత్సరం లో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆలయం నిర్మించడం జరిగిందన్నారు. అప్పటినుండి ఈ ఆలయం వద్ద పూజలు జరుగుతున్నాయని, ప్రతి ఏడాది శ్రీకృష్ణుని జన్మదినం నాడు ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. ఏడాది కరోనా ప్రభావితంతో పోలీసులు ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దూరంగానే ఉండి భక్తులు స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు.