YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్న దుకాణాల లైసెన్స్ లు రద్దు

అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్న దుకాణాల లైసెన్స్ లు రద్దు

ఎమ్మిగనూరు ఆగష్టు 11  
రైతుల అవసరాన్ని వ్యాపారులు డబ్బులు గా దోచుకుంటున్నారు. యూరియా, ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తూ రశీదు ఇవ్వకుండా గోడౌన్ పాస్ చూపిస్తే చాలు యూరియా ను ఇస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే ఎరువులను ఇవ్వరు. దీంతో చాలామంది రైతులు మనకెందుకులే అనుకుంటున్నారు. కానీ మండల కేంద్రంలో కొందరు రైతులు ఇలాంటి దుకాణాల్ని సీజ్‌ చేయించారు. పట్టణంలోని శ్రీ మానస ట్రేడర్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ ఎరువుల దుకాణాలలో  యూరియా కొనేందుకు నియోజకవర్గంలోని రైతులు సోమవారం ఒక్కసారిగా వచ్చారు. ఒక్కో యూరియా బస్తా ఎంఆర్‌పి రూ.265 ఇవ్వాల్సి ఉంది. కాని పెద్దఎత్తున రైతులు రావడంతో దుకాణదారులు ఒక్కో బస్తాకు రూ.340 వసూలు చేశారు. అయితే బిల్లు మాత్రం ఎంఆర్‌పి ధరకే ఇస్తున్నారు. ఇది గమనించిన రైతులు శ్రీ మానస ట్రేడర్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ దుకాణదారుల్ని ప్రశ్నించారు. తాము అలాగే ఇస్తామని, ఇష్టముంటే తీసుకోండి లేకుంటే వెళ్లండని రైతులకు దురుసుగా సమాధాన మిచ్చారు. దీంతో వారు వెంటనే వ్యవసాయ అధికారికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎఓ  ఉషారాణి విచారణ జరిపారు. రైతుల ఫిర్యాదు వాస్తవేమనని తేలడంతో దుకాణాల్ని సీజ్‌ చేశారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తా మని ఎఓ తెలిపారు.స్థానిక మీడియా(ఉత్తేజిత రిపోర్టర్)తో ఎఓ మాట్లాడుతూ పట్టణంలోని  శ్రీ మానస ట్రేడర్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ షాపుల లైసెన్స్ లను 15 రోజుల పాటు రద్దు చేసినట్లు ఉషారాణి తెలిపారు. సోమవారం రైతుల ద్వారా ఫిర్యాదు అందిందని ఆ ఫిర్యాదు ఆధారంగా శ్రీ మానస ట్రేడర్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ లను తనిఖీ చేయగా అధిక ధరలకు విక్రయించినట్లు రుజువు కావడంతో దుకాణాల లైసెన్సు లను 15 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు తెలిపారు

Related Posts