నంద్యాల ఆగష్టు 11
నంద్యాల రెవెన్యూ డివిజన్ ఆఫీసు యందు మంగళవారం నాడు సబ్ కలెక్టర్ (ఆర్డీవో) గా కల్పనా కుమారి బాధ్యతలు చేపట్టారు . గతంలో పనిచేసిన ఆర్డీవో రామకృష్ణారెడ్డి. నంద్యాల తాహశీల్దారు రవికుమార్ తో పాటు కార్యాలయ సిబ్బంది తదితరులు ఆర్డీవో గారికి స్వాగతం పలికారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 2018 ఐఏఎస్ బ్యాచ్ అధికారిని . ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని నంద్యాల సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. నంద్యాల డివిజన్ లో రెవెన్యూ సిబ్బంది పూర్తి సహయ సహకారాలు అందించాలని అన్నారు . అందరం కలిసి కట్టుగా విధులు నిర్వహించి నంద్యాల డివిజన్ ను అభివృద్ధి పథం వైపు నడిపిస్తామన్నారు. నంద్యాల ఆర్డీవో రామకృష్ణారెడ్డి నుంచి సబ్ కలెక్టర్ గా చార్జీ తీసుకున్నాని అన్నారు. ఈకార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.