విజయవాడ ఆగష్టు 11
విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ పై నార్త్ ఏసీపీ షేక్ షర్ఫుద్దీన్ స్పందించారు. అజిత్ సింగ్ నగర్, సత్యనారాయణ పురం పరిధిలో గంజాయి సేవించే వారు,బ్లెడ్ బ్యాచ్ వారు అధికంగా ఉన్నారు. కేదారేశ్వరపేట ఖుద్దూస్నగర్కు చెందిన షేక్ నాగుల్మీరా(మున్నా), రాహుల్ అనే యువకుల మధ్య పాత గొడవ వుంది. గత నెల 31వ తేదీన రాహుల్తో పాటు అయోధ్యనగర్కు చెందిన వినయ్ తదితరులు కేదారేశ్వరపేటలో కత్తులు, కర్రలతో నాగుల్మీరా వర్గంపై దాడికి పాల్పడ్డారు. అయోధ్యనగర్కు చెందిన పుట్టా వినయ్ (18)పై ఈ నెల 9వ తేదీన తనపై ఖుద్దూస్నగర్కు చెందిన షేక్ నాగుల్మీరా(25), న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన షేక్ ఈసబ్ (26), బుడమేరు మధ్యకట్ట ప్రాంతానికి చెందిన లావేటి సాయికుమార్(24), సీతన్నపేటకు చెందిన నాగులాపల్లి సాయి పవన్(20), కృష్ణలంకకు చెందిన కంది సాయికుమార్ (20)లతో పాటు మరికొందరు దాడిపాల్పడ్డారు. పుట్టా వినయ్ ఫిర్యాదు చేసిన వారిలో నాగుల్మీరా, ఈసబ్, సాయికుమార్, సాయిపవన్, కంది సాయికుమార్లతో పాటు మరో ఇద్దరు బాలలను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అరెస్టు చేసిన వారి నుంచి ఓ ద్విచక్రవాహనం, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఖుద్దూస్నగర్కు చెందిన రాహుల్, పటమటకు చెందిన సాయికిరణ్, అయోధ్యనగర్కు చెందిన పుట్టా వినయ్, వికాస్ అనే యువకులను అరెస్టు చేసామని అయన అన్నారు. వీరి నుంచి సైతం కత్తులు స్వాధీనం చేసుకుని, మరో అయిదుగురు కోసం గాలింపు జరుపుతున్నామని అయనఅన్నారు.