YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పాదయాత్రకు రేవంత్ ప్లాన్

 పాదయాత్రకు రేవంత్ ప్లాన్

హైద్రాబాద్, ఆగస్టు 12, 
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా ఆయన తీరు మారలేదు. తాను చేయాలనుకున్నది చేస్తారు. సీనియర్లతో తనకు పనిలేదంటారు. తనను అనేక మంది వ్యతిరేకిస్తున్నా బేఫికర్ అంటారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన రేవంత్ రెడ్డి ఇంకా ఖరారు కాకపోవడంతో కొత్త ఎత్తులు వేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ పై వత్తిడి తెచ్చేందుకు, వ్యక్తిగతంగా తన ఇమేజ్ ను పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి త్వరలో తెలంగాణ అంతటా పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పడం లేదు. తన అనుచరుల ద్వారా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డిపై సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు.రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో రేవంత్ రెడ్డి క్రేజ్, ఇమేజ్ కొంచెం తగ్గింది. మరో ఏడాదిలో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించి పార్లమెంటులో అడుగు పెట్టారు. అయితే కొంతకాలంగా మౌనంగా ఉన్న రేవంత్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు.తెలంగాణ మొత్తం పాదయాత్రకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. పాదయాత్రకు అవసరమైన రూట్ మ్యాప్ ను కూడా రేవంత్ రెడ్డి సిద్దం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాలను రేవంత్ అనుచరులు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది గాంధీభవన్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. పాదయాత్రకు ఎవరి అనుమతి ఉందని సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలిన భావిస్తున్నారు.కానీ రేవంత్ రెడ్డి నేరుగా ఈ విషయం చెప్పకపోవడం విశేషం. పార్టీ నుంచి వచ్చే స్పందన బట్టి పాదయాత్రపై ఆయన నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఏదీ నేరుగా చెప్పరు. తాను అనుకున్నది, చేయదల్చుకున్నది తన అనుచరుల చేత చెప్పించి వచ్చే స్పందన బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే జగ్గారెడ్డి, వి.హనుమంతరావు లాంటి నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానంతో చెప్పించి రేవంత్ రెడ్డి పాదయాత్రకు బ్రేక్ వేయాలని ప్రయత్నిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి తను అనుకున్నట్లు పాదయాత్ర చేస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts