కడప, ఆగస్టు 12,
బీటెక్ పూర్తైన వెంటనే దక్షిణ కొరియాలోని సామ్‌సంగ్ సంస్థలో ఏడాదికి కోటి రూపాయల వేతనమిచ్చే ఉద్యోగం వచ్చింది. ఏడాదిన్నరపాటు ఆ ఉద్యోగం చేశారు. అయితే చిన్నప్పుడు సివిల్స్ రాసి కలెక్టర్‌గా ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.రూ. కోటి జీతం.. విలాసవంతమైన జీవితం.. కానీ అవేవీ వద్దుకున్నారు. ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.. కష్టపడి ఐఏఎస్ అయ్యారు. ఇది కడప రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్ సక్సెస్ స్టోరీ. పృథ్వీ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ద్వారక తిరుమల. తండ్రి శ్రీనివాసరావు నగల వ్యాపారి. తల్లి గృహిణి.. అక్క ఉన్నారు. ఏడో తరగతి వరకు సొంత ఊరిలోనే చదువుకున్నారు. తర్వాత గుడివాడలోని విశ్వభారతి స్కూల్‌లో పదోతరగతి.. శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్మీడియట్ చదివారు.. 2011లో నిర్వహించిన ఐఐటీలో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించి.. ఐఐటీ ముంబైలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో చేరారు.
బీటెక్ పూర్తైన వెంటనే దక్షిణ కొరియాలోని సామ్‌సంగ్ సంస్థలో ఏడాదికి కోటి రూపాయల వేతనమిచ్చే ఉద్యోగం వచ్చింది. ఏడాదిన్నరపాటు ఆ ఉద్యోగం చేశారు. అయితే చిన్నప్పుడు సివిల్స్ రాసి కలెక్టర్‌గా ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మంచి ఉద్యోగ అవకాశం కావడంతో ఉద్యోగంలో చేరారు. 2016లో ఉద్యోగానికి గుడ్ బై చెప్పి.. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తొలి ప్రయత్నంలోనే 24వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యారు.. ఆయన లక్ష్యాన్ని అందుకున్నారు.ఐఏఎస్ అయ్యాక చిత్తూరులో సహాయ కలెక్టర్‌గా పనిచేశారు.. తర్వాత శ్రీకాళహస్తిలో విధులు నిర్వర్తించారు. అనంతరం సెక్రటేరియట్ ఎనర్జీ విభాగంలో శిక్షణ పొందారు.. తర్వాత ఐఏఎస్‌గా కడపలో మొదటి పోస్టింగ్ వచ్చింది.. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో. ప్రజలందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని అందించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.