YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఓ సందర్భంలో బుద్దునికి మరియు వారి శిష్యపరివారానికి మధ్య ఆసక్తికర ప్రశ్నోత్తరాల సమయం గడిచింది. ఇవి చాలా ఉపయోగకరమని ఇక్కడ తెలియజేస్తున్నాం.

ఓ సందర్భంలో బుద్దునికి మరియు వారి శిష్యపరివారానికి మధ్య ఆసక్తికర ప్రశ్నోత్తరాల సమయం గడిచింది. ఇవి చాలా ఉపయోగకరమని ఇక్కడ తెలియజేస్తున్నాం.

ఓ సందర్భంలో బుద్దునికి మరియు వారి శిష్యపరివారానికి మధ్య ఆసక్తికర ప్రశ్నోత్తరాల సమయం గడిచింది. ఇవి చాలా ఉపయోగకరమని ఇక్కడ తెలియజేస్తున్నాం.
#6_ప్రశ్నలు_6_పొరబాట్లు_బుద్దుని_సవరణలు
1. అతి పదునైన వస్తువు ఈ ప్రపంచంలో ఏది?
శిష్యులు చాలా తెలివిగా ఖడ్గం అని బదులిచ్చారు.
బుద్దుడు ఈ విధంగా తెలిపారు., ఈ ప్రపంచంలోనే అతి పదునైనది మానవుని నాలుక. అతి చాలా సులువుగా ఇతరుల అనాలోచితంగా బాధించగలదు. అందుకే దానికి చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడవలెను.
2. ప్రపంచంలో అన్నిటికన్నా దూరంగా వున్నది ఏది?
కొంతమంది చంద్రుడు, సూర్యుడు, ఆకాశం, నక్షత్రాలు అంటూ చెప్పుకొచ్చారు.
కాని అన్నిటికన్నా దూరంగా వున్నది గతం. కరిగిపోతున్న కాలం.
మనం ఎవరిమైనప్పటికీ, ఎంత శక్తివంతులమైనా కూడా మనం కాల చక్రంలో ముందుకు పోవడమే తప్పించి వెనుకను మరలలేము కదా. అందుకే వర్తమానమును సమృద్దిగా, బుద్దిగా ఉపయోగించుకునేవాడు శ్రేష్ఠుడు.
3. ప్రపంచంలోనే అతి పెద్ద పదార్ధం ఏది?
పర్వతాలు, భూమి, సూర్యుడు అంటూ సమాధానం శిష్యుల నుంచి.
బుద్దుని జవాబు: అతి పెద్ద పదార్ధం కామం(కోరిక)
ఇవి జనులకు ఎంతలా అంటే అది ఈ సృష్టిలో వున్న అన్నింటికన్నా పెద్ద పరిమాణంలో వుంటాయి. వాటిలోనే మునిగి తేలుతూ.. అవి నెరవేరితే సుఖం లేదంటే అవి దక్కలేదనే దుఃఖంలోనే మునిగిపోయి నిజమైన ఆనందాన్ని కోల్పోతారు. కనుక అమిత ప్రభావం చూపే ఈ విషయాల పట్ల మితముగా వ్యవహరించుట మంచిది.
4. అత్యంత బలమైనది లేక బరువైనది ఏది?
శిష్యులు ఇనుము, ఏనుగు వంటి సమాధానాలు ఇచ్చారు.
బుద్దుని సవరణ: ప్రపంచంలో బరువైనది, దృఢమైనది ప్రమాణం లేదా మాట. ఎవరికన్న చాలా సులువుగా ఇచ్చేయగలిగేది కాని నిలబెట్టుకోవడంలో కష్టతరమైనది.
5. మరి అత్యంత చులకన గలది? (తేలికగలది)
దుమ్ము, పత్తి, ఆకులు, గాలి అంటూ పలు సమాధానాలు వినిపించాయి శిష్యుల నుండి.
కాని బుద్దుడు ఈ విధంగా శెలవిచ్చారు.
అన్నటికన్నా తేలికైనది వినయం కాని చాలా మంది అది తమకి ఆపాదించుకోలేరు. తమ తమ జీవితాలలో కాస్త పురోగతి సాధించిన వెంటనే వినయాన్ని కోల్పోయి అహమును ఆభరణముగా చేసుకుంటారు. కాని అది ఎవరికి ప్రయోజనకారి కాదు కదా.. అది దహించు అగ్ని వంటిది.
6. మనకు అత్యంత ఆత్మీయులు ఎవరు?
తల్లి దండ్రులు, స్నేహితులు, బంధువులు అంటూ సమాధానాలు వచ్చాయి శిష్యుల నుండి.
కాని బుద్దుని సమాధానం ఇలా వుంటుంది.
అత్యంత సన్నిహితమైనది మనకు మృత్యువు. ఎందుకంటే మరణం తధ్యమైనది. అది ఏ క్షణమైనా మనకు కలుగవచ్చు..

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts