YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పోతిరెడ్డిపాడు నీళ్లు ఆంధ్రాకు తరలిస్తే సీఎం రాజీనామా చేయాలి - పొన్నం ప్రభాకర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

పోతిరెడ్డిపాడు నీళ్లు ఆంధ్రాకు తరలిస్తే సీఎం రాజీనామా చేయాలి - పొన్నం ప్రభాకర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

హైదరాబాద్ ఆగస్టు 12, 
 ఆనాడు తెలంగాణా కు సంబంధించినటువంటి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుండి ఆంధ్రాకు నీటిని తీసుకపోత ఉంటే పోతిరెడ్డిపాడు పొక్క పెట్టిండ్రు, నీళ్లు ఎత్తుక పోతా ఉన్నారు అని నలుగురు మంత్రులం రాజీనామా చేసినం అన్నారు.  ఇప్పుడు తెలంగాణలో అధికారంలో మీరే ఉన్నారు, అక్కడ ప్రాజెక్టులకు టెండర్లు జరుగుతున్నాయి. అపెక్స్ కౌన్సిల్ మీటింగు వెళ్ళడానికి సమయం దొరుకుత లేదు. పొద్దున లేస్తే ఏదో జరిగిపోయినట్టు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు.
 మీరే అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారిని ఆహ్వానించి భోజనాలు పెడతారు, యం.ల్.ఏ రోజా ఇంటికి వెళ్లి రాయలసీమ నీ రతనాల సీమ చేస్తారని అంటారు, ఎవరైనా మాట్లాడితే వాళ్లకే అజీర్తి అయితది నాకేంది అని అంటారు. ???? ఈరోజు పోతిరెడ్డిపాడు నుండి ఆంధ్ర పాలకులు నీళ్లు తీసుక పోతుంటే ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉంటున్నారు. ఈ పరిస్థితిని తెలంగాణ ప్రజలు గమనించాలని అయన అన్నారు.
 ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకొని ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి, తెలంగాణ కి రావాల్సిన ఒక్క నీటి చుక్క పోయిన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా అనే విధంగా ఒత్తిడి తెచ్చి పోరాటం చేయండి.  ఇష్టం వచ్చినప్పుడల్లా బిజెపి పార్టీని, మరొకసారి కాంగ్రెస్ పార్టీని, ఆంధ్ర పాలకులను దూషించడం, ఉద్వేగాలను రెచ్చగొట్టడం లాంటివి చేసి పబ్బం గడపకుండా, పోతిరెడ్డిపాడు నీళ్ల విషయంలో దక్షిణ తెలంగాణా కి అన్యాయం జరిగితే అధికారంలో ఉన్న మీరే దానికి బాధ్యత వహించాలి అనే విషయం మర్చిపోకండని అన్నారు.  పోతిరెడ్డిపాడుకి సంబంధించిన నీళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహారం చేయండి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దక్షిణ తెలంగాణ ప్రజల పక్షాన ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు అందజేస్తుందని పొన్నం అన్నారు.

Related Posts