శ్రీకాకుళం ఆగస్టు 12,
ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ధర్మాన కృష్ణదాస్ తొలిసారి జిల్లాకు వచ్చారు. అయనకు పైడి భీమవరం వద్ద పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. శ్రీకాకుళం బైపాస్ జంక్షన్ వద్దనున్న ఆంజనేయస్వామి ఆలయంలో ధర్మాన ప్రత్యేక పూజలు చేసారు. సెవెన్ రోడ్డు జంక్షన్ లోని వైఎస్.రాజశేఖర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత అయన జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు సీఎం అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నా ఈ పదవి శ్రీకాకుళం జిల్లాకు దక్కిన గౌరవం. ఉపముఖ్యమంత్రిగా నాకు అవకాశం కల్పించినందుకు శ్రీకాకుళం జిల్లా తరపున, ఉత్తరాంధ్ర బీసీల తరపున సీఎంకు కృతజ్ఞతలు. కరోనా నివారణ పై మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో 16, 17, 18 తేదీల్లో రివ్యూలు చేయనున్నాం. టీడీపీ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు మేం ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది కలగకూడదనే మెరుగైన సంక్షేమాన్ని అందిస్తున్నాం. జగన్ మరో 30 ఏళ్లు సీఎంగా ఉండేలా అందరం కృషి చేద్దామని అయన అన్నారు.