విశాఖపట్నం ఆగస్టు 12,
ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి ఏజెన్సీ లో ఉన్న కాలు వేలు పైనుంచి వరద నీరు ప్రవహించడంతో గ్రామాల నుంచి మైదాన ప్రాంతానికి వచ్చేవారికి తీవ్ర అంతరాయం కలుగుతుంది మైసమ్మ గూడెం వద్ద అ కాజ్వే పైనుంచి వరద నీరు భారీగా రావడంతో మల్లంపల్లి నుంచి జంగారెడ్డిగూడెం వచ్చే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. బుట్టాయిగూడెం మండలం వద్ద ఇటీవల కాజ్వే ప్రవాహానికి తెగిపోయి కొట్టుకుపోవడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రజలు ఇటు అటు దాటేందుకు తాత్కాలిక మార్గం ఏర్పాటు చేశారు ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ఏర్పాటుచేసిన అప్రోచ్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది పట్టణ పాలెం లో కూడా అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో ఏజెన్సీ నుంచి జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం వెళ్లే ప్రజలు దారి లేక అవస్థలు పడుతున్నారు తాత్కాలిక మరమ్మతులు చేపట్టే దానికన్నా ఓ వంతెన నిర్మిస్తే మా కష్టాలు తీరతాయని ఏజెన్సీ వాసులు వాపోతున్నారు అలాగే కురుస్తున్న భారీ వర్షాలకు దొరమామిడి ఎర్ర కాలువ జలాశయం లోకి భారీగా వరద నీరు చేరుతుంది.