మంత్రాలయం ఆగస్టు 12,
శ్రీ కృష్ణాష్టమి వేడుకలను శ్రీ మఠంలో పీఠాధిపతుల ఆధ్వర్యంలో అర్చకులు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రాఘవేంధ్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ కృష్ణుని ప్రతిమను మూల బృందావనం దగ్గర ఉంచి పీఠాధిపతులు విశేష పూజలు నిర్వహించారు. మంత్రాలయంలో శ్రీ కృష్ణాష్టమి సంధర్భంగా గోపికా ,కృష్ణుల వేషాధారణలతో తమ చిన్నారులను సుందరంగా ముస్తాబు చేసి తల్లి దండ్రులు,అక్కాచెల్లెలు ,అవ్వా తాతలు కుటుంబసభ్యులు తమ చిన్నారుల వేషాధారణ చూసి ఎంత గానో మురిసిపోయారు.గోపికల అలంకరణలో చిట్టి పాపలు ,వెన్నె దొంగ వేషాల్లో చిట్టి బాబులు చూపరులను ఎంతగానో ఆకట్టు కున్నారు.