YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా ఆరోగ్యం దేశీయం

లంగ్ క్యాన్సర్ తో సంజయ్ దత్

లంగ్ క్యాన్సర్ తో సంజయ్ దత్

ముంబై, ఆగస్టు 12 (న్యూస్ పల్స్)
సంజయ్ దత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ దృష్ట్యా తాను కొంతకాలం వర్క్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు తన కుటుంబమే అలాగే తన స్నేహితులు తనతోనే ఉన్నారని తన ఆరోగ్యం గురించి ఎవ్వరూ ఆందోళనకు గురవద్దని అభిమానులకు సూచించారు. అభిమానుల ప్రేమాభిమానాల వల్ల త్వరగా రికవర్ అయిపోతానని చెప్పారు. ఈ వార్త విని సంజయ్ దత్ సెలెబ్రిటీ ఫ్రెండ్స్ కూడా షాకయ్యారు. సంజయ్ దత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ వార్త విని మున్నాభాయ్ ఫ్యాన్స్ షాకయ్యారు. సంజయ్ దత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కామెంట్స్ లో "గెట్ వెల్ సూన్" విషెస్ రాస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కి సంబంధించిన మరణాలు ఎక్కువగా లంగ్ క్యాన్సర్ వల్లే చోటుచేసుకుంటున్నాయి. లంగ్ క్యాన్సర్ కి సంబంధించిన ప్రారంభ లక్షణాలుగా చిన్నపాటి దగ్గు, శ్వాస అందకపోవడం వంటి లక్షణాలను పరిగణించవచ్చు. క్యాన్సర్ డెవెలప్ అవుతున్న కొద్దీ ఈ లక్షణాలు మరింత తీవ్రతరమవుతాయి. మిగతా క్యాన్సర్ ల లాగానే లంగ్ క్యాన్సర్ విషయంలో కూడా అలసట అలాగే ఆకలి లేకపోవడం వంటి లక్షణాలుంటాయి.చాలా సందర్భాల్లో లంగ్ క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలు ఎర్లీ స్టేజ్ లో కనిపించవు. ఒకవేళ లక్షణాలు కనిపంచినా అవి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ఐతే, కామన్ గా కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్రానిక్ కాఫ్, రక్తం కూడా పడుతుంది.
దగ్గేటప్పుడు, దగ్గు తీవ్రమైనప్పుడు, నవ్వేటప్పుడు లేదా డీప్ బ్రీత్ తీసుకునేటప్పుడు, ఛాతిలో నొప్పి, బ్యాక్ అలాగే భుజాల నొప్పి.
సడన్ గా శ్వాస అందకపోవడంలో సమస్యలు. రొటీన్ యాక్టివిటీస్ సమయంలో కూడా ఈ సమస్య రావడం.
బలహీనంగా అలాగే అలసటగా ఉన్నట్టు అనిపించడం.
ఆకలి మందగించడం.
బ్రోన్కైటీస్ లేదా న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తగ్గకపోవడం
వీజింగ్ లేదా గొంతు బొంగురుపోవడం.

Related Posts