YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పోతిరెడ్డిపాడుపై విపక్షాలు టార్గెట్

పోతిరెడ్డిపాడుపై విపక్షాలు టార్గెట్

హైద్రాబాద్, ఆగస్టు 12 
ఏపీలో జగన్ సర్కారు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోన్న వేళ.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ సామర్థ్యం పెంచడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని తెలిసినా.. కేసీఆర్ సైలెంట్‌గా ఉండిపోయారని.. ఏపీ సీఎంతో ఉన్న స్నేహమే దీనికి కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మా వాటాలో చుక్క నీటిని వదులుకోం, పిలిచి అన్నం పెడితే.. అంటూ కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేసినప్పటికీ.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ప్రతిపక్ష నేతలు మాత్రం సీఎంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.నాడు పోతిరెడ్డిపాడు నీళ్లు తరలిస్తే.. నలుగురు మంత్రులతో రాజీనామా చేయించిన కేసీఆర్.. ఇప్పుడు అవే నీళ్లను రాయలసీమకు తరలించేందుకు సహకరిస్తున్నారని.. టీపీసీసీ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటికీ ఏపీలో ప్రాజెక్టులకు టెండర్లు జరుగుతున్నాయని.. అలాంటిది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు వెళ్ళడానికి సమయం లేదా అని పొన్నం ప్ర‌శ్నించారు. ‘‘పొద్దున్నే లేస్తే ఏదో జరిగిపోయినట్టు మాటలు కోటలు దాటుతున్నాయి.. జగన్‌ను ఆహ్వానించి భోజనాలు పెడతారు, ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి రాయలసీమను రతనాల సీమ చేస్తామంటారు కానీ.. ఇప్పుడు పోతిరెడ్డిపాడుపై ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే మీరెందుకు మౌనంగా ఉంటున్నారు’’ అని కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు.పోతిరెడ్డిపాడు నీళ్ల విషయంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగితే అధికారంలో ఉన్న కేసీఆర్‌ బాధ్యత వహించాలని పొన్నం వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి, ఏపీపై ఒత్తిడి తెచ్చి పోరాటం చేయాల‌ని ఆయన కేసీఆర్‌కు సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో తమ మద్దతు ఉంటుందన్నారు.

Related Posts