కామారెడ్డి ఆగస్టు 12
కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు.
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ కు చెందిన మహేష్ అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు కొద్దిరోజులుగా కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అంతకుముందు కామారెడ్డి లోని వివిధ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేసి ఇప్పుడు పాఠశాల మూతపడటంతో అర్థం కాని పరిస్థితుల్లో ఎలా జీవించాలో అర్థం కాక మనసు చంపుకొని కూరగాయలు మరొక రోజు కూలీగా వెళ్తూ రోజులు వెళ్లదీస్తున్నారు. ఇది ప్రైవేటు ఉపాధ్యాయుల కష్టాలు ఇకనైనా ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను అదుకోవాలని ప్రైవేటు ఉపాధ్యాయుల కష్టాలు కొంచమైనా పట్టించుకుంటే బాగుంటుందని ప్రవేట్ ఉపాధ్యాయులు అందరూ కోరుకుంటున్నారు.