YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పూలే విగ్రహాన్ని కూల్చిన దుండగులను కఠినంగా శిక్షించాలి

పూలే విగ్రహాన్ని కూల్చిన దుండగులను కఠినంగా శిక్షించాలి

జగిత్యాల  ఆగస్టు 12 
 తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల మహాత్మ జ్యోతి బాపూలే విగ్రహాలపై దాడులు జరగడం హేయమైన చర్య ఆని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్ముల విగ్రహాలకు , గృహాలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు   పూర్తిగా విఫలమయ్యాయని బిసి సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా లోని కరీమాబాద్ ప్రాంతంలో మహాత్మ జ్యోతి బాపూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు ,చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ కేంద్రంలోని తహసిల్ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇస్తూ నిరసన తెలిపారు.
 మహాత్మ జ్యోతి బాపూలే  ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల ప్రజల కోసం అనేక సంస్కరణలు చేపట్టిన గొప్ప మహా మేధావి అని మేధావుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్న దుండగులను శిక్షించడంలో ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఓరుగంటి భార్గవ్ రామ్ , మానాల కిషన్, నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఐక్య వేదిక కార్యదర్శి , జగిత్యాల పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జంగిలి రాజేష్ ముదిరాజ్ , దిటి సతీష్ పటేల్ , షేర్ నర్సారెడ్డి , గాలి పెల్లి గంగా ప్రసాద్ , సిరిపురం నిరంజన్ , బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మండ బేరి నరేష్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనుగంటి రవి కుమార్ , జిల్లా ఉపాధ్యక్షుడు తోపారపు శ్రీహరి , ఆకుల అమర్నాథ్ , రాపర్తి రవి , చిలుక సత్యనారాయణ ,రాపర్తి వినోద్ మేరు, గట్ల శ్రీనివాస్ , ఎస్ విజయ్ కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు .

Related Posts