YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాముడి పోస్టల్ స్టాంపులకు డిమాండ్

రాముడి పోస్టల్ స్టాంపులకు డిమాండ్

న్యూఢిల్లీ, ఆగస్టు 13, 
దేశమంతా రామమయమే. అయోధ్యలోని రామాలయం భూమి పూజన్ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీశ్రీ రాముడి తపాలా బిళ్ళల్ని విడుదలచేశారు. అనంతరం వాటికి మంచి డిమాండ్ ఏర్పడింది. రాముడి జీవితం ఆధారంగా తీసుకొచ్చిన పోస్టల్ స్టాంపులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వీటి డిమాండ్ భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ ఉండటం విశేషం. భావి తరాలకు చూపించేందుకు వీటిని కొనుగోలు చేసి దాచిపెట్టుకుంటున్నారు.
ప్రస్తుతం పోస్టల్ విభాగంలో 50 వేల స్టాంపులు అందుబాటులో ఉన్నాయి. నాలుగు రోజుల్లో అయోధ్య పరిశోధనా సంస్థ 5 వేల టికెట్లను కొనుగోలు చేసింది. ఇందుకోసం తపాలా శాఖకు రూ.12 లక్షలు చెల్లించింది. అదే సమయంలో లక్నో-అయోధ్య పోస్టాఫీస్ నుంచి 500 టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఈ స్టాంప్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా.. విదేశాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని పోస్టల్ సర్వీసెస్ అధికారులు చెప్పారు.
కార్పొరేట్ మై స్టాంప్ కింద తయారు చేసిన స్టాంపుల్లో ఇప్పటివరకు మొత్తం 10వేల వరకూ అమ్ముడయ్యాయి. 5 వేల షీట్లు ముద్రించగా ఒక షీట్లో మొత్తం 12 స్టాంపులు ఉన్నాయి. ఒక స్టాంప్ ధర రూ.25. తపాలా స్టాంపులకు వున్న డిమాండ్ కారణంగా బాగా అమ్మకాలు సాగుతున్నాయంటున్నారు. లక్నో-అయోధ్యతోపాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి స్టాంపులు కావాలని కోరుతున్నారు.
రాముడికున్న డిమాండ్ అలాంటిది. రామాలయం కడుతున్నవేళ రాముడికి సంబంధించి అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు అయోధ్య మంచి పర్యాటక ప్రాంతం అవుతోంది. రాముడి ఆలయం ఎలా కడుతున్నారనేది చూడడానికి వేలాదిమంది అయోధ్యకు రావడం కనిపిస్తోంది. శ్రీరామ జన్మభూమి ప్రాంతంలో నిర్మించే ఆలయం ప్రపంచానికే తలమానికంగా వుంటుందని భావిస్తున్నారు.

Related Posts