YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

దాతల పేరుతో...బాలికపై లైంగిక దాడి

దాతల పేరుతో...బాలికపై లైంగిక దాడి

హైద్రాబాద్, ఆగస్టు 13, 
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలికను అనాథ శరణాలయంలో చేర్పించడమే ఘోర తప్పిదమైంది. విరాళాలు ఇచ్చే ఓ దాత లైంగిక వాంఛలకు అభం శుభం తెలియని ఆ బాలిక జీవితం ముగిసిపోయింది. బాలిక సంరక్షణ బాధ్యతలు చూడాల్సిన వారే ఆ దాతకు సహకరించడం బాధించే అంశం. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే..చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో.. 2015లో ఆ బాలికను బంధువులు హైదరాబాద్ శివార్లలోని అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేటు అనాథ శరణాలయంలో చేర్పించారు. అనాథ ఆశ్రమానికి విరాళాలు ఇచ్చే వేణుగోపాల్ రెడ్డి కన్ను ఆ బాలికపై పడింది. ఆయన ఆశ్రమానికి వచ్చినప్పుడు నిర్వాహకులు ఆ బాలికను ఐదో అంతస్థులోని ఓ గదిలోకి పంపేవారు. డ్రింక్ తాగడంతో ఆమె స్పృహ కోల్పోయేది. మెలకువ వచ్చి చూసే సరికి ఒంటి మీద దుస్తులు ఉండేవి కావు. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని వార్డెన్ బెదిరించేది. అప్పుడు ఆ బాలికకు ఇవేమీ అర్థం కాలేదు.ఇటీవల లాక్‌డౌన్‌ కారణంగా ఆ బాలిక న్యూ బోయిన్‌పల్లిలోని పిన్ని వాళ్లింటికి వెళ్లింది. తరచుగా అనారోగ్యం బారిన పడుతుండటంతో.. బంధువులు ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. దీంతో ఆ బాలిక అత్యాచారానికి గురైన విషయం వారికి తెలిసింది. బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు.బాలల సంరక్షణ కమిటీ సమక్షంలో ఆ బాలిక వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద జులై 31న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ విచారణ ముగిసే వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. బాలికకు చికిత్స అందించే విషయంలోనూ ఆలస్యమైంది. బాలికను సంరక్షణ కేంద్రంలో చేర్పించే సమయానికే పరిస్థితి విషమించింది. దీంతో నిలోఫర్‌లో చేర్పించి.. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించారు. కానీ ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.అమ్మానాన్న లేకపోవడంతోనే నాపై అత్యాచారం చేశారు కదా.. పెద్దయ్యాక లాయర్‌ను అవుతానని చెప్పిన ఆ బాలిక చనిపోవడంతో బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేపట్టారు. విచారణ సమయంలో ఆరోగ్యంగానే కనిపించిన బాలిక అకస్మాత్తుగా చనిపోవడం పట్ల బాలల సంరక్షణ కమిటీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ బాలికకు డ్రగ్స్ ఇచ్చారేమో తేల్చాలని నిలోఫర్ హాస్పిటల్ వర్గాలను కోరింది.

Related Posts