వాషింగ్టన్, ఆగస్టు 13,
మెరికా, చైనా మధ్య మాటలయుద్ధం మరింత ముదిరింది. ‘నిప్పుతో చెలగాటం ఆడొద్దు’ అని అమెరికాను చైనా హెచ్చరించింది. అమెరికా ప్రతినిధులు ఇటీవల తైవాన్‌ను సందర్శించడంపై డ్రాగన్ ఈ వ్యాఖ్యలు చేసింది. అమెరికా ఆరోగ్య విభాగ చీఫ్ అలెక్స్ అజర్ ఇటీవల తైవాన్‌లో 3 రోజుల పాటు పర్యటించారు. తన పర్యటనలో భాగంగా కరోనా వైరస్ విషయంలో చైనా తీరుపై ఆయన విమర్శలు చేశారు.అజర్ పర్యటనపై చైనా ప్రతినిధి స్పందించారు. తైవాన్, అమెరికా మధ్య అధికారుల రాకపోకలను చైనా వ్యతిరేకిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ పేర్కొన్నారు.‘పూర్తిగా చైనాకు సంబంధించిన వ్యవహారాల్లో అమెరికా అనవసరంగా తలదూరుస్తోంది. లేని భ్రాంతులను సృష్టిస్తోంది. నిప్పుతో చెలగాటం ఆడితే కాలుతుంది’ అని లిజాయన్ పేర్కొన్నారు. ‘ఎవరికో బానిసలుగా ఉండొద్దు.. విదేశీయుల మద్దతుపై ఆధారపడి స్వతంత్రం కోసం ఆరాటపడితే అది ముగింపే అవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.