YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

ఐఐటీ, ఐఐఎంలలో ఆన్ లైన్ ఎడ్యుకేషన్

ఐఐటీ, ఐఐఎంలలో ఆన్ లైన్ ఎడ్యుకేషన్

న్యూఢిల్లీ, ఆగస్టు 13, 
ఇటీవల నూతన జాతీయ విద్యా విధానం 2020 ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలోనూ పెనుమార్పులకు శ్రీకారం చుడుతోంది. ఐఐటీలు, ఐఐఎంలను ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు యూజీసీ, ఏఐసీటీఈ నుంచి సూచనలను కోరుతోంది.విద్యార్ధులకు భౌతికంగా క్లాసులను నిర్వహించే భారాన్ని విద్యా సంస్ధలకు తగ్గించే దిశగా మొత్తం విద్యా వ్యవస్ధను ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్థగా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. తొలుత ఉన్నత విద్యాసంస్ధలైన ఐఐటీలు, ఐఐఎంలను ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.పిఎంఓ, నీతి ఆయోగ్ ఈ విషయంలో యుజిసి, ఏఐసీటీఈ అభిప్రాయాలు, సలహాలను కోరింది.దీనికి సంబంధించి బ్లూప్రింట్‌ను తయారుచేసేందుకు ఏఐసీటీఈ చీఫ్‌ అనిల్‌ సహస్రబుధే, యూజీసీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎంపి పునియాల నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆన్‌లైన్‌ విద్యకు అవసరమైన పటిష్ట మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపైనా వీరు కసరత్తు చేయనున్నారు.

Related Posts