YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

రోజుకో మలుపు తిరుగుతున్న శిరోముండనం కేసు

రోజుకో మలుపు తిరుగుతున్న శిరోముండనం కేసు

కాకినాడ, ఆగస్టు 13, 
ఏపీలో సంచలనం రేపిన సీతానగరం శిరోముండనం ఘటన రాష్ట్రపతి భవన్ కు చేరింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సీరియస్‌గా స్పందించారు. ఫిర్యాదు అందిన 24 గంటల వ్యవధిలోనే స్పందించిన కోవింద్ ఘటనలో బాధితుడికి పూర్తి స్థాయిలో సహకరించాలంటూ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్‌లో అసిస్టెంట్ సెక్రటరీ ఏ జనార్దన్ బాబుకు ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేశారు.  నేరుగా జనార్దన్ బాబుని కలవాలని వరప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. శిరోముండనం ఘటనపై పూర్తి స్థాయి కాల్ రికార్డులు, వీడియో క్లిప్పులు, కాల్ రికార్డింగ్‌లతో వరప్రసాద్‌ జనార్దన్ బాబుని కలవనున్నారు. మరోవైపు రాష్ట్రపతి స్పందనపై శిరోముండనం బాధితుడు వర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి జోక్యంతో తనకు న్యాయం దక్కుతుందనే భరోసా ఏర్పడిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వైసీపీ నేత ఫిర్యాదుతో వరప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ...తీవ్రంగా గాయపరచడంతో పాటు పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేశారు. తనను పోలీసులు అవమానించారని ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు. దళిత సంఘాలు ఈ ఘటనపై నిరసన తెలిపాయి. దీనిపై డీజీపీ గౌతం సవాంగ్ తీవ్రంగా స్పందించారు. బాధితుడి ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు. ట్రైనీ ఎస్ఐ, కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేశారు. శాఖాపరమయిన చర్యలకు ఆదేశాలిచ్చారు.  అయితే ఈ సంఘటనకు కారణమయిన వైసీపీ నేతను అరెస్టు చేయాలని బాధితుడు కోరాడు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన బాధితుడు నేరుగా రాష్ట్రపతికి లేఖ రాసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖ సంచలనం కలిగించింది. దీనిపై తక్షణమే స్పందించిన రాష్ట్రపతి బాధితుడికి పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రత్యేక అధికారిని నియమించారు.ఈ ఘటనపై రాష్ట్రపతి స్పందించడంపై టీడీపీ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. బాధితుడికి సత్వరం న్యాయం జరగాలని ఆకాంక్షించారు.

Related Posts