YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వీధులలో వినాయక విగ్రహాలను పెట్టరాదు వినాయక చవితి పండుగను ఎవరిఇళ్లలో వాళ్లు జరుపుకోవాలి

వీధులలో వినాయక విగ్రహాలను పెట్టరాదు  వినాయక చవితి పండుగను ఎవరిఇళ్లలో వాళ్లు జరుపుకోవాలి

ఎమ్మిగనూరు  ఆగష్టు 13  
ఆగస్టు 22న జరిగే వినాయక చవితి పండుగనాడు వినాయక విగ్రహాలను పట్టణంలోని పుర వీధులలో కూర్చోపెట్టారాదని పట్టణ సి.ఐ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ రోజు ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ లో వినాయక చవితి ఉత్సవాలను ఏవిధంగా జరుపుకోవాలో వినాయక కేంద్ర కమిటీ సభ్యులతో వారు చర్చించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో సి.ఐ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకు మానవాళిపై కరోనా వైరస్ విజృంభిస్తున నేపథ్యంలో 2020వ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను ఎవరిఇళ్లలో వాళ్లు జరుపుకోవాలని, వినాయక విగ్రాహలు 2అడుగుల కు మించి ఉండరాదని వారు తెలిపారు.ఈ సంవత్సరం పట్టణంలోని  ప్రధాన కూడళ్లలో, రోడ్లపైన, వీధులలో వినాయక విగ్రహాలను కూర్చోపెట్టారాదని వారు పేర్కొన్నారు.పట్టణంలో ఉన్న ఆయా దేవాలయాలలో 2అడుగుల వినాయక విగ్రహాలను కూర్చోపెట్టిన పూజా కార్యక్రమాలు కేవలం పూజారి మాత్రమే నిర్వహించాలని, దేవాలయ సమయంలో మాత్రమే వినాయక విగ్రహాన్ని భక్తులు సామాజిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకోవాలని వారు అన్నారు. నిమజ్జనం రోజు దేవాలయం దగ్గర అన్నదానం నిర్వహించరాదని తెలిపారు. బహిరంగంగా వినాయక విగ్రహాలను కూర్చోపెట్టరాదు.ఒక వేళ కూర్చోపెట్టిన ఆయా కమిటీ సభ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.నిమజ్జనం రోజు ఉదయం నుండే  వినాయక విగ్రాహలను తీసుకెళ్లాలని, వినాయక విగ్రహంతో పాటు కేవలం 5 మంది మాత్రమే సామాజిక దూరం పాటిస్తూ మేళతాళాలు లేకుండా ఊరేగింపుగా వెళ్లి విగ్రహాన్ని నిమజ్జనం చేసిరావాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వినాయక కేంద్ర కమిటీ సభ్యులు కామర్ధి నాగేషప్ప(మాజీ కౌన్సిలర్), రామకృష్ణ,ప్రకాష్ జైన్,శ్రీనివాసులు (కృష్ణవేణి కోచింగ్),ఓంకార్ శ్రీనివాసులు,మధుబాబు(మాజీ కౌన్సిలర్)విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ధర్మగుణ,సహా కార్యదర్శి శ్రీనివాసులు మరియు కమిటీ సభ్యులు తదితరులు హాజరయ్యారు

Related Posts