YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోవిడ్ పరీక్షల్లో ఏపీ ప్రధమ స్థానం

కోవిడ్ పరీక్షల్లో ఏపీ ప్రధమ స్థానం

నెల్లూరు  ఆగష్టు 13  
నెల్లూరు జిల్లా పరిషత్ ఎమర్జెన్సీ కంట్రోలింగ్ సెంటర్ నుండి క్వారంటైన్ సెంటర్ లో ఉన్న కరోనా పేషంట్స్ తో జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని  వివరాలు తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్, కలెక్టర్ చక్రధర్ బాబు, శాసనసభ్యులు వర ప్రసాద్,  జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 138ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ ను కోవిడ్ హాస్పిటల్స్ గా వినియోగిస్తున్నాం. మైల్డ్ కోవిడ్ ఉన్న వారికీ మరో 109కోవిడ్ కేర్ సెంటర్లు ను గుర్తించాం. కరోనా బాధితుల కోసం 56వేలకు పైగా బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. కరోనా రోగులకు సహాయ పడడానికి 24గంటలు పని చేసే కాల్ సెంటర్స్ తో హెల్ప్ డెస్క్ లు కూడ ఏర్పాటు చేసాం. కేవలం అర్ధ గంటలో కోవిడ్ పేషంట్ కు హాస్పిటల్ లో బెడ్ కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నాం. నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 8, 619మంది కరోనా పేషంట్స్ డీఛార్జి అయ్యారని అన్నారు.
ఆక్సిజన్ బెడ్స్ 2, 340ఉండగా 843మంది కి ఆక్సిజన్ వినియోగిస్తున్నాం.. 1, 497బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా మొబైల్ యూనిట్స్ ద్వారా 1500పైగా కేంద్రాల్లో శాంపిల్స్ సేకరిస్తున్నాం. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో టెస్ట్లు చేయడం, కరోనా సోకిన వారిని వేగంగా గుర్తించడం, వారితో కాంటాక్ట్ లో ఉన్న వారిని కూడ గుర్తించడం, తగిన వైద్య సదుపాయం కల్పిస్తున్నాం. కోవిడ్ హాస్పిటల్ కు చికిత్స కోసం వచ్చిన ఏ ఒక్కరూ వేచి ఉండవలసిన పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి అదేశిo చారు. మెనూకు సంబంధించి..ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా... వాటిపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి కోవిడ్ పేషంట్ కు 500రూపాయలు వెచ్చించడం జరుగుతుంది. కోవిడ్ టెస్ట్ లు  చేయడంలో దేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో టెస్ట్లు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి  ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. క్లస్టర్ల లో పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం ద్వారా వీలైనంత త్వరగా కేసులు గుర్తిస్తున్నాం. కరోనా పాజిటివ్ గా గుర్తించిన కేసులకు వేగంగా చికిత్స చేయడం తో పాటు, వైరస్ వ్యాప్తిని అరికట్టాలని లక్ష్యం గా పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ పేషంట్ కు వైద్యం నిరాకరించిన ప్రభుత్వ నిబంధనలు మేరకు కఠినంగా చర్యలు తీసుకుంటాం. కరోనా మరణాలకు సంబంధించి లెక్కలు సరిగా లేవని...కరెక్ట్ గా చేప్పడం లేదని చంద్రబాబు నాయుడు పదే పదే విమర్శలు చేస్తున్నారు... కరోనా నియంత్రణలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహారిస్తుంది. దేశంలో ఎక్కడ ఖర్చు చేయలేనన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఈ విపత్తుకర పరిస్థితులల్లో రాజకీయాలు చేయడం చంద్రబాబు మానుకోవాలి. కరోనా కట్టడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టి బాధితులకు అండగా ఉండాలని అదేశి o చారు. కరోనా పేషంట్ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత... దురదృష్టవ శాత్తు చనిపోతే... ఎటువంటి అపోహలకు తావు లేకుండా నిర్భయంగా దహన సంస్కారాలు చేయవచ్చని అన్నారు.
కరోనా మృత దేహం పై ఆరు గంటలు తర్వాత ఎటువంటి వైరస్ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ,  ఇతర వైద్య ఆరోగ్య సంస్థలు వెల్లడించాయి. ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు... ఒకవేళ ఎవరైనా ఆ మృత దేహాలను తీసుకు వెళ్ళాక పోతే, ప్రభుత్వమే బాధ్యతలు తీసుకొని లీగల్ కార్యక్రమాలు పూర్తి చేసి, ప్రభుత్వమే వారికి సంబంధించిన లాంఛనాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు

Related Posts