విజయవాడ ఆగష్టు 13
స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ బుధవారం పరిశీలించారు.తరువాత అయన మాట్లాడుతూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఐడియాలు, ఇతర అంశాలు ల్లో జాతీయ స్థాయిలో 26 అవార్డులు దక్కాయి. చీరాల ఘటనలో ఎస్.ఐ పై చాలా వేగంగా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి ఘటనల్లో ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు. చీరాల సంఘటనలో పోలీస్ అధికారి పైనే చర్యలు తీసుకున్నాం, గతంలో ఏ ప్రభుత్వ హయాంలో వేగవంతంగా ఇలాంటి చర్యలు తీసుకోలేదు. జాతీయ స్ధాయిలో 26 అవార్డులు రావడం అత్యంత సంతోషకరమని అన్నారు. చాలా అభివృద్ధి, మార్పలు, టెక్నాలజీ వినియోగం ఆధారంగా జాతీయ స్థాయిలో 26 అవార్డులు వచ్చాయి. శిరోముండనం విషయం మా దృష్టికి వచ్చిన తక్షణమే కేసు నమోదు చేసి.. బాధ్యు డైన ఎస్సైని అరెస్టు చేసి రిమాండ్ కు పంపాం..ఇంకా విచారణ కొనసాగుతుంది. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. స్వర్ణప్యాలెస్ ఘటనలో కచ్ఛితంగా బాధ్యులపై చర్యలుంటాయి. ప్రాధమిక దర్యాప్తులో ముగ్గురుని స్వర్ణప్యాలెస్ ఘటనలో అరెస్టు చేశామని వెల్లడించారు.