ఛండీఘడ్, ఆగస్టు 13
బ్యాంక్ మేనేజర్ లోన్ ఇవ్వడం కుదరదని చెప్పడంతో అతని స్నేహితుడు నీచానికి దిగాడు. ఏకంగా భార్యని ఫ్రెండ్‌కి ఎరగా వేశాడు. ఆమెతో తరచూ ఫోన్లు చేయించి ముగ్గులోకి దింపాడు. అంతలోనే దిమ్మతిరిగే షాకిచ్చాడు. మేనేజర్‌పై రేప్ కేసు నమోదైంది. తనను రేప్ చేశాడంటూ స్నేహితుడి భార్య బ్యాంక్ మేనేజర్‌పై కేసు పెట్టింది. ఊహించని షాక్‌తో కంగుతిన్న మేనేజర్ అసలు విషయం ఆరా తీశాడు. ఫ్రెండ్ డిమాండ్స్ ఒప్పుకోనందుకే తనను ఇలా ట్రాప్ చేశాడని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ దారుణ ఘటన హర్యానాలో వెలుగుచూసింది.రోహ్‌తక్ జిల్లకు చెందిన ఓ వ్యక్తి బ్యాంక్ మేనేజర్ అయిన తన స్నేహితుడికి రూ.80 వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు చెల్లించడం ఆలస్యమవడంతో బ్యాంకు లోన్ రూపంలో డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అందుకు స్నేహితుడు ఒప్పుకోకపోవడంతో నీచానికి దిగాడు. తన భార్య, అత్తతో కలసి కన్నింగ్ ప్లాన్ వేశాడు. భార్యతో హనీట్రాప్ చేయించాడు. ఆమెతో తరచూ స్నేహితుడికి ఫోన్ చేయించి నెమ్మదిగా ముగ్గులోకి దింపాడు. అదను చూసి తనను రేప్ చేశాడంటూ భార్యతో కేసు పెట్టించాడు.భర్త ప్లాన్‌లో భాగంగా భార్య పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి తనను బ్యాంక్ మేనేజర్ రేప్ చేశాడని ఫిర్యాదు చేసింది. కిలాడీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో మేనేజర్ కంగుతిన్నాడు. అప్పు తిరిగి చెల్లించలేదన్న కోపంతో తన స్నేహితుడే ట్రాప్ చేయించినట్లు గ్రహించిన మేనేజర్ నేరుగా జిల్లా ఎస్పీని కలసి ఫిర్యాదు చేశాడు. రేప్ కేసు సెటిల్ చేసుకునేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేస్తున్నాడంటూ వాపోయాడు.రెడ్‌హ్యాండెడ్ పట్టుకునేందుకు రివర్స్ ప్లాన్ వేసిన పోలీసులు.. మొదటి విడత కింద రూ.5 లక్షలు ఇస్తానని బ్యాంక్ మేనేజర్‌తో ఫోన్ చేయించారు. డబ్బు తీసుకునేందుకు వచ్చిన ఫ్రెండ్‌ని రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న అతని భార్య, సాయమందించిన అత్త అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.