హైద్రాబాద్, ఆగస్టు 13
కరోనా వైరస్ బాధితులకు చికిత్స కోసం గిలీద్ సైన్సెస్ తయారు చేసిన యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డిసివిర్ జనరిక్ వెర్షన్‌ను భారత్‌లో జైడస్ కాడిలా ఫార్మా ఆవిష్కరించింది. ఈ ఔషధాన్ని భారత్‌లో అత్యంత చౌకగా అందజేయడానికి జైడస్ ముందుకొచ్చింది. 100 ఎంజీ ఇంజక్షన్‌ను రూ. 2,800కే అందజేయాలని నిర్ణయించామని తెలిపింది. మార్కెట్లో ‘రెమ్‌డాక్’ పేరిట రెమ్‌డిసివిర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందజేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఈ ఔషధాన్ని విక్రయిస్తామని బీఎస్ఈ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆ సంస్థ పేర్కొంది.ఇప్పటికే రెమ్‌డిసివిర్‌ను నాలుగు సంస్థలు భారత్‌లో మార్కెటింగ్ చేస్తుండగా, ఇప్పుడు జైడస్ కాడిలా వాటిని సరసన చేరింది. హెటిరో ల్యాబ్స్, సిప్లా, మైలాన్ ఎన్వీ, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్‌లు ఇప్పటికే ఈ డ్రగ్ జనరిక్ వెర్షన్‌ను విడుదల చేశాయి. అమెరికాకు చెందిన గిలీద్ సైన్సెస్ మొత్తం 127 దేశాల్లోని ఫార్మ సంస్థలతో ఒప్పందం చేసుకుని, రెమ్‌డిసివిర్ ఉత్పత్తికి అనుమతులను ఇచ్చింది. భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సియాంజీ ఇంటర్నేషనల్‌తో గిలీద్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.రెమ్‌డిసివిర్ సరఫరా తగినంతంగా లేదని పలు రాష్ట్రాలు కొద్ది వారాల కిందట ఫిర్యాదు చేశాయి. కానీ, సిప్లా సంస్థ మాత్రం మార్కెట్‌లో రెమ్‌డిసివిర్ కొరతలేదని ఈ వారం ప్రకటించింది. మరోవైపు, దేశంలో కరోనా వైరస్ కేసులు గడచిన రెండు వారాలుగా రోజుకు సగటున 50వేలకుపైగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 2.4 మిలియన్లకు చేరుకోగా.. 47,150 మంది ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయారు.మరోవైపు, జైడిస్ కాడిలా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దేశంలో కొనసాగుతున్నాయి. దేశంలో భారత్ బయోటెక్, జైడస్ కాడిలా సంస్థలు తయారుచేసిన క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.