YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలులో కూలీలకు వజ్రాలు

కర్నూలులో కూలీలకు వజ్రాలు

కర్నూలు, ఆగస్టు 13
రాయలసీమను ఒకప్పుడు రతనాలసీమగా పేరుగాంచింది. సాధారణంగా వర్షాకాలంలో పొలాల్లో పంటల సాగుకు దుక్కులు చేస్తారు. కానీ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం పడిందంటే చాలు వజ్రాల కోసం వేట ప్రారంభం అవుతుంది. ఏటా వర్షాకాల ప్రారంభంలో ఇక్కడ 50 - 60 వజ్రాల దాకా లభ్యమైతాయని అంచనా. తొలకరి వర్షాలుతో రాయలసీమలో వజ్రాల కోసం అన్వేషణ మొదలవుతుంది. దుమ్ముపట్టిన వజ్రాలు తొలకరి చినుకులతో తడిసి సూర్యుడి కాంతికితళుకున్న మెరుస్తాయి.తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి ఔత్సాహికులు వజ్రాల వేట కోసం కర్నూలు జిల్లాకు తరలివస్తారు. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దులోని పంటపొలాల్లో వజ్రాలు లభించడం సర్వసాధారణంగా మారింది. ప్రతి ఏటా తొలకరి జల్లులు పడగానే జనం వేయి కళ్లు చేసుకుని పొలాల వెంట వజ్రాల కోసం వెతుకుతుంటారు.తాజాగా, కర్నూలు జిల్లాలో రెండు వజ్రాలు లభ్యం కావడం వార్తల్లో నిలిచింది. జొన్నగిరిలో వ్యవసాయ కూలీకి ఒకటి, తుగ్గలికి చెందిన మరో కూలీకి వజ్రాలు దొరికాయి. ఈ రెండు వజ్రాలను వ్యాపారులు రూ.3 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది ఓ రైతుకు లభించిన వజ్రాన్ని రూ.60 లక్షలు చెల్లించి వ్యాపారులు కొనుగోలుచేసిన విషయం తెలిసిందే.కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని జొన్నగిరి, ఎర్రగుడి, పెరవలి, గిరిగెట్ల, తుగ్గలి, మద్దికెర, అగ్రహారం, పగిడిరాయి, రాతన కొత్తూరు, బసినేపల్లి, గిరిగెట్ల, అమినాబాద్, రాతన గ్రామాలు వజ్రాల కారణంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆ గ్రామాల భూముల్లో ఏటా వర్షాకాలంలో వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి

Related Posts