అమరావతి ఆగష్టు 13
ఫిరాయింపులు ఆ వైసీపీ ఇన్ చార్జి సీటుకే ఎసరు తెచ్చాయా? చీరాలలో చక్రం తిప్పిన ఆ నేతకు ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వల్ల చెక్ పడిందా? వైసీపీ అధిష్టానం వేరే సీటును చూసుకోవాలని తెగేసి చెప్పిందా? అంటే ఔననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.రాష్ట్రమంతా వైసీపీ గాలివీచినా.. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ నుంచి పోటీచేసిన ఆమంచి కృష్ణమోహన్ ఓటమి చవిచూశాడు. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం ఎమ్మెల్యేగా గెలిచాడు.అంతకుముందు చీరాలలో ఆమంచి ఏమీ చెప్తే అదే జరిగేది. ఇప్పుడు కరణం బలరాం టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన తరువాత వైసీపీ హైకమాండ్ అతడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఎందుకంటే కరణం బలరాంకు ప్రకాశం జిల్లా అంతటా పట్టు ఉండడంతో వైసీపీ హైకమాండ్ గుర్తించి అతడి మాటకే విలువనిస్తోంది.ఈ పరిస్థితుల్లో ఆమంచికి పర్చూరు ఇన్ చార్జిగా ఇస్తాం వెళ్లు అని వైసీపీ అధిష్టానం ఆఫర్ ఇచ్చిందట.. కానీ ఆయన దానికి నో చెప్పి వెళ్లకుండా చీరాలలోనే రాజకీయం చేస్తాం అని కూర్చున్నాడు. కానీ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో సీరియస్ గానే ఉందని సమాచారం. ‘వెళితే పర్చూర్ వెళ్లు.. లేకపోతే చీరాలలో రాజకీయం చేస్తే ఊరుకోము’ అని తెగేసి చెప్పినట్టు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.మరి వైసీపీ అధిష్టానం మాటను ఆమంచి లెక్కచేస్తాడా? నియోజకవర్గం మారుతాడా? లేక చీరాలనే పట్టుకొని తిరుగుబాటు లేవనెత్తుతాడా అన్నది ప్రకాశం జిల్లాలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.