YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేస్తాం -మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హామీ

పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేస్తాం -మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి    హామీ

ఆదిలాబాద్  ఆగష్టు 13  
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రం సాధన సమితి కన్వీనర్ ఎల్చల దత్తాత్రేయ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజనరెడ్డి  కరొనా-కారణంగా ప్రత్యేక అనుమతులతో కలవడం జరిగింది. సాధన సమితి కన్వీనర్ దత్తాత్రేయ మంత్రితో మాట్లాడుతూ  జూన్ 3వ తేదీన జరిగిన వ్యవసాయ శాఖ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  తెలంగాణ రాష్ట్రంలో పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే,ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఓయూ జేఏసీ అధ్యక్షులు విద్యార్థి నేత ఎల్చల దత్తాత్రేయ ఆధ్వర్యంలో రైతు సంఘాలు,ప్రజా సంఘాలు,విద్యార్థి సంఘాల,ఆధ్వర్యంలో పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రం సాధన సమితిగా ఏర్పాటై వివిధ పోరాటాలు చేస్తూ,అధికారులకు,ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది, అందులో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిగారిని గురువారం కలిసి పత్తి సాగు చేయడంలో ఉత్పత్తిలో ఆదిలాబాద్ జిల్లాకు గల ప్రత్యేకతలను,భౌగోళిక అనుకూలతలను,రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ పత్తి సాగు చేస్తున్న ఏకైక జిల్లా ఆదిలాబాద్ అని సాగు విస్తీర్ణం గత సంవత్సరం పత్తి ఉత్పత్తిలో ఆదిలాబాదు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్న గణాంకాలతో కూడిన వివరాలతో కుడిన సమాచారాన్ని మంత్రికి అందించి వివరించారు,ఈ సందర్భంగా మంత్రి  సాధన సమితి సభ్యులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  ప్రతిపాదనలతో కూడిన లేఖ సైతం రాస్తానని ప్రత్యేక చొరవ తీసుకుని మాట్లాడి ఒప్పించి  తప్పకుండా ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ పత్తి పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు జరిగే విధంగా కృషి చేస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఈ ప్రకటన చేస్తానని తెలిపారు,మంత్రి  ప్రతి స్పందనతో ఆనందం వ్యక్తం చేసిన కమిటీ సభ్యులు మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు  ఈ సమయంలో మంత్రిని కలిసిన వారిలో ఎరుకొండ శ్రీనివాస్,ఆకునూరి ఉదయ్,పసరకొండ కిషోర్,శివ తదితరులు పాల్గొన్నారు

Related Posts