YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మహాత్మా గాంధీ స్థాయిలో అంబేడ్కర్‌ను కొలవాలి: మంత్రి కేటీఆర్

మహాత్మా గాంధీ స్థాయిలో అంబేడ్కర్‌ను కొలవాలి: మంత్రి కేటీఆర్

సిరిసిల్ల పర్యటనలో భాగంగా.. సిరిసిల్ల టౌన్ లో పునర్నిర్మించిన అంబేడ్కర్, మహాత్మాగాంధీ జంక్షన్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంబేడ్కర్ 127వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ స్థాయిలో బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను కొలవాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగంతోనే సాధ్యమయిందన్నారు. అంబేడ్కర్ అందరివాడని.. కొందరివాడు కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగు పర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కుల వివక్ష, మత వివక్ష, ప్రాంత వివక్ష లేని రోజే అంబేడ్కర్‌కు నిజమైన నివాళన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణలో 700 గురుకుల పాఠశాలలు నెలకొల్పి ఒక్కో విద్యార్థికి 1.20 లక్షలు ఖర్చు చేస్తున్నదన్నారు. దేశంలో ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం దళితులను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నామని కేటీఆర్ ఉద్ఘాటించారు.

Related Posts