విజయవాడ,ఆగస్టు 14,
ఏపీలో బీజేపీ ఖచ్చితంగా కుల రాజకీయాలను మాత్రమే నమ్ముకుందని క్లియర్‌కట్‌గా అర్థమైపోయింది. తెలంగాణలో కంటే ఏపీలో కులాల కుంపట్లు ఎక్కువ. ఇక్కడ ఓటింగ్ అంతా కులం, మతం బేస్‌మీదే ఎక్కువుగా ఉంటుంది. ఈ క్రమంలోనే కమ్మ, రెడ్ల తర్వాత బలంగా ఉన్న కాపు వర్గాన్ని నమ్ముకునే ఇక్కడ బలపడాలన్నది బీజేపీ స్కెచ్‌గా అర్థమవుతోంది. ఆ మాటకు వస్తే తెలంగాణలోనూ కాపులు బలంగానే ఉన్నారు. అక్కడ కాపుల్లో ఎక్కువ భాగం బీసీ వర్గమైన మున్నూరు కాపు జాబితాలోకి వస్తారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి వరకు కమ్మలు, వెలమలు, రెడ్ల హవానే నడిచిందే తప్ప సంఖ్యా పరంగా ఎక్కువుగా ఉన్న మున్నూరు కాపుల రాజకీయం నడవలేదు. ఈ క్రమంలోనే గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తర తెలంగాణలో ఇదే వర్గానికి చెందిన బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌కు సీట్లు ఇచ్చి సంచలనం విజయం సాధించింది. తెలంగాణ రాజకీయాల చరిత్రలో అది కూడా టీఆర్ఎస్ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో ఇద్దరు మున్నూరు కాపులు గెలవడం అంటే మామూలు విషయం కాదు.తెలంగాణలో ఇప్పటి వరకు రాజకీయంగా వెనకపడిన మున్నూరు కాపులను ఏకతాటిమీదకు తీసుకు వచ్చే క్రమంలోనే బీజేపీ ఈ వర్గాన్ని ఎంకరేజ్ చేయడంతో పాటు ఇప్పుడు అదే వర్గానికి చెందిన బండి సంజయ్‌కే తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించింది. కుల పట్టింపులు లేనిచోటే బీజేపీ చాపకింద నీరులా కుల రాజకీయాలకు తెరలేపుతోందంటే కులాల ప్రభావం బలంగా ఉన్న ఏపీలో ఇంకెలా స్ట్రాటజీతోముందుకు వెళుతోందో తాజా పరిణామాలే చెపుతున్నాయి. వాస్తవానికి గత ఎన్నికలకు ముందే కాపులను ఆకర్షించే క్రమంలో అదే వర్గానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ బీజేపీ పగ్గాలు ఇచ్చింది. కన్నాకు ఏపీ బీజేపీ పగ్గాలు ఇచ్చాక… ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో చాలా మంది టీడీపీ లు కాషాయం గూటికి చేరుకున్నారు. మేనేజ్‌మెంట్‌లో ఆరితేరిన కమ్మలు ఏపీ బీజేపీని కూడా ఏదోలా కబ్జా చేసేస్తారన్న సందేహాలే నిన్నటి వరకు ఉన్నాయి. ఆ మటకు వస్తే కన్నాను నడిపించింది చంద్రబాబు కాదా ? అన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి.ఎప్పుడు అయితే చంద్రబాబు, టీడీపీ పొడ అంటే ఎంత =మాత్రం గిట్టని సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ పగ్గాలు ఇచ్చారో బీజేపీ కాపు రాజకీయంపై క్లారిటీ వచ్చేసింది. అంటే ఏపీలో బీజేపీ ఎదిగేందుకు కాపు రాజకీయాన్నే నమ్మింది. ఇక ఈ క్రమంలోనే ఈ వర్గం ఓట్లు చీలకుండా ఉండేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్‌ను తమ గుప్పెట్లోకి తెచ్చుకుంది. పవన్ ఎన్నికల్లో ఓడినా ఆ వెంటనే బీజేపీ చెంత చేరిపోయారు. సోము పగ్గాలు చేపట్టిన వెంటనే పవన్ ఆయన్ను కలవడం.. ఆ వెంటనే కాంగ్రెస్‌లో ఉంటూనే రాజకీయాలకు దూరమైన చిరు సైతం సోము వీర్రాజును కలవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో బీజేపీ + జనసేన కూటమి అధికారంలోకి రావాలని ఆకాంక్షించడాన్ని బట్టి చూస్తే బీజేపీ స్కెచ్‌లో భాగంగా తెరవెనక చాలా రాజకీయం నడుస్తోంది.చిరుకు మళ్లీ బీజేపీతో మినహా రాజకీయ పునర్వైభవం రావడం కష్టం.. ఈ విషయం ఆయనకు తెలుసు.. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడే చిరు బీజేపీలో చేరతారని అనుకోలేం.. గుంటూరు జిల్లాలో జనసేన వర్గాల నుంచి అందిన కీలక సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల నాటికి చిరు తన సామాజిక వర్గానికి చెందిన పలువురు కీలక నేతలను బీజేపీలో చేర్పించే పనిలో బిజీ బిజీ అవుతారట. ఈ లిస్టులో ఇతర పార్టీల్లో కీలకంగా వ్యవహరించిన వారంతా ఉంటారని తెలుస్తోంది. ఓ వైపు ఏపీలో రోజు రోజుకు బలహీనపడుతోన్న టీడీపీని ఖాళీ చేయించడంతో పాటు తమ వర్గానికి చెందిన ప్రస్తుత, మాజీ నేతలను కమలాకర్ష్‌లో బీజేపీలో చేర్పించడమే చిరు ముందు పెట్టిన టార్గెట్ అంటున్నారు. ఓవరాల్‌గా జనసేన + బీజేపీ కలిసి చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌గా పైకి కనపడుతున్నా ఇదంతా బీజేపీ కేంద్ర నాయకత్వం.. రామ్ మాధవ్ డైరెక్షన్‌లోనే నడుస్తోందని అంటున్నారు.ఇక చిరు గతంలో మంత్రులుగాను, టీడీపీలో రాష్ట్ర కార్యవర్గంలో కీలకంగా వ్యవహరించిన వారిని ఆకర్షించే పని మొదలు పెట్టనున్నారట. ఇదే కాపు వర్గానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజుతో చర్చలు మొదలయ్యాయని అంటున్నారు. ఇక చిరు రేపటి 2024 తర్వాత ఆయన బీజేపీలో ఉన్నా లేదా జనసేనలో ఉన్నా ఏ రాజ్యసభ లేదా ఇతర పదవులు బీజేపీ ఇవ్వొచ్చు.. లేదా అప్పటి ఈక్వేషన్స్‌ను బట్టి పక్కన పెట్టొచ్చు.. బీజేపీ అంటే అంతేగా మరి..?