విజయవాడ, ఆగస్టు 14,
కృష్ణ నది ఎగువ ప్రాంతాలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్గాలకు ప్రకాశం బ్యారేజీకు భారీగా నీటి ప్రవాహం పెరిగి నీటి సామర్థ్యం గరిష్ట స్థాయికి చేరింది కృష్ణా నది ఎగువ ప్రాంతంలోని మునేరులో సాయంత్రం రెండువేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా ఉదయానికి 14,500 క్యూసెక్కులకు చేరిందన్నారు.ఈ ప్రవాహం సాయంత్రానికి 20,000 క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 11.02 అడుగులకు నీటి సామర్థ్యం పెరిగిందన్నారు. ప్రకాశం బ్యారేజ్ గరిష్ట నీటిమట్టం 12 అడుగులకు చేరితే బ్యారేజ్ గేట్లు ఎత్తి ఆ నీటిని కిందికి వదులుతామన్నారు. ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజ్‌కి పట్టిసీమ 24 పంపుల ద్వారా నీటిని తీసుకొచ్చామని స్థానికంగా నీటి ప్రవాహం పెరగడంతో ఇప్పుడు 10 పంపుల ద్వారానే నీటిని తెచ్చి 14 పంపులను ఆపేస్తామన్నారు. సాయంత్రానికి ఇక్కడ వరద పరిస్థితిని బట్టి పట్టిసీమ పంపుల ద్వారా తెచ్చే నీటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.ప్రకాశం బ్యారేజ్ నుంచి డెల్టాలోని కాల్వలక 10,000 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నామని ఇందులో పశ్చిమ ప్రధాన కాల్వకు రెండు వేల క్యూసెక్కులు, కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నామన్నారు. ఇలా వచ్చే నీటి ప్రవాహాన్ని దిగువన సముద్రంలోకి వదలకుండా ఉండటానికి ఎగువ ప్రాంతాలలో నీటిని నిల్వ చేసేందుకు వైకుంఠపురం వద్ద బ్యారేజీని నిర్మించి అందులో 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. నీటిపారుదల శాఖ విజయవాడ సర్కిల్ ఎస్ఈ కేవీఎల్ ఎన్‌డి చౌదరి మాట్లాడుతూ చిట్ట చివరి భూములకు కూడా నీటిపారుదల సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ప్రకాశం బ్యారేజ్ లో ప్రవాహం పెరిగినందున పెడన పరిసర ప్రాంతాలలో ఉన్న రామరాజు పాలెం కాల్వకు నీటిని విడుదల చేసి రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. కృష్ణా డెల్టా లో ఇప్పటి వరకు 6,97,359 ఎకరాల్లో నాట్లు పూర్తి అయ్యాయన్నారు.కృష్ణా నది ఎగువ ప్రాంతాలైన మునేరు నది నుంచి వచ్చే నీటి ప్రవాహం పెరిగినందున ప్రకాశం బ్యారేజ్‌లో నీటి మట్టం పెరుగుతుందన్నారు. గత మూడు సంవత్సరాలుగా కృష్ణా నది కి పట్టిసీమ ద్వారా 170 టీఎంసీలు తీసుకురావటంతో పాటు కోట్ల రూపాయల పంట దిగుబడిని సాధించగలిగామన్నారు.