జయవాడ, ఆగస్టు 14
ఊహించని రీతిలో పెళ్లి ఆగిపోగా.. అప్పటికే వంట పూర్తి కావడంతో బంధువులంతా భోజనాలు చేసి తమ ఇళ్లకు వెళ్లిపోయిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. సినిమా సీన్‌ను తలపించే ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గుడ్లవల్లేరుకు చెందిన ఓ యువకుడికి దూర ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. యువతితోపాటు ఆమె బంధువులు కొద్ది రోజులుగా స్థానికంగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారుఉదయం ఓ చర్చిలో వీరి వివాహానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.పెళ్లి తంతు మొదలు కాగా.. నీకు ఈ వివాహం సమ్మతమేనా అని మతపెద్ద వరుణ్ని అడిగాడు. దీనికి ఆ యువకుడు సమ్మతమే అని తెలిపాడు. అదే ప్రశ్న వధువును అడగ్గా ఎవరూ ఊహించని రీతిలో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సమాధానం చెప్పింది. దీంతో మత పెద్దతో సహా అందరూ షాకయ్యారు. ఈ పెళ్లి జరగదని చెప్పి.. మీ ఇళ్లకు వెళ్లిపోండని మతపెద్ద వారికి సూచించాడు.యువతి బంధువులు నచ్చజెప్పడంతో.. కొన్ని గంటల తర్వాత ఆమె పెళ్లికి అంగీకారం తెలిపింది. కానీ ఈసారి యువకుడు మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆ వివాహం ఆగిపోయింది. కానీ అప్పటికే భోజనాలను సిద్ధం చేయడంతో ఆ తతంగం ముగించి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.