YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

శివార్లలో డబుల్ రిజిస్ట్రేషన్లు

శివార్లలో డబుల్ రిజిస్ట్రేషన్లు

హైద్రాబాద్, ఆగస్టు 14, 
నగర శివార్లలో రియల్ బూమ్ రోజురోజుకు పెరగడంతో అవినీతికి అలవాటు పడిన కొందరు సబ్ రిజిస్ట్రార్లు డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి జేబులు నింపుకుని స్ద్థలాల యాజమానుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు. ఇక ఆస్తిని ఒకరి పేరుమీద రిజిస్ట్రేషన్ ఉన్నా, మరొకరి పేరుమీద చేస్తూ డబుల్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇస్తున్నారు. ఈ విషయం తెలిసిన తెలియనట్లు ఉంటూ భారీ మొత్తంలో ముడుపులు దండుకుంటున్నారు. రిజిస్ట్రార్ చేసి న పత్రాలు తప్పుని తెలిసినా దాని సరిదిద్దేందుకు ఒప్పకో రు. రిజిస్ట్రేషన్ అయితే అది తమ పరిధిలో ఉండదని, న్యా యం స్ద్థానంలో ఏవరు నిజమైన యాజమానులో తేల్చుస్తుందని సలహాలిస్తూ అమాయక ప్రజలతో చెలగాటమాడుతున్నారు.రెండేళ్ల క్రితం జరిగిన మియాపూర్ భూకుంభకోణం ఘటనపై 08 అధికారులు సస్పెండ్ కావడంతో పాటు, 13 మంది అధికారులకు స్ద్థానం చలనం కలిగింది. అయిన లం చాలకు తెగబడిన అధికారులు కొత్త దారులు వెతుకుతూ పా తపద్దతిని పక్కగా పాటిస్తూ కోటీశ్వర్లుగా మారుతున్నారు. గ్రేటర్ నగర పరిధిలో 23 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలుండ గా వాటిలో ప్రధానంగా శివారు ప్రాంతాలైన రాజేంద్రనగ ర్, హయత్‌నగర్,సరూర్‌నగర్, పెద్ద అంబర్‌పేట, అబ్దులాపూర్‌మెట్, ఉప్పల్, కీసర,కుత్బులాపూర్, సూరారం, బాచుపల్లి వంటి ప్రాంతాల్లో రోజుకు 25నుంచి 32వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా,వాటిలో 05నుంచి 08 డాక్యుమెంట్లు డబుల్ రిజిస్ట్రేషన్లకు చెందినవే ఉన్నట్లు బయటపడుతుంది.బహిరంగ మార్కెట్ ధరలో 03శాత చొప్పన కమిషన్ తీసుకుంటూ దర్జాగా తమ పని ముగిస్తున్నారు. సుమారు రూ. 8 నుంచి 10లక్షలవరకు చీకటి వ్యవహారం నడిపిస్తూ ఇందులో 6 మంది అధికారులు సాయంత్రవేళ్లలో పంపకా లు చేసుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెలల్లో రాజేంద్రనగర్ మండలంలో కాటేదాన్ ఏరియాల్లో ఈ డబుల్ దందా వెలుగులోకి వచ్చింది. స్ద్థానికంగా ఉండే కొంతమంది చోటా నాయకులు ఖాళీ స్ద్థలాలుంటే వాటికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసుకుని, వాటి ద్వారా మరోకరికి విక్రయిస్తూ రెండుచేతులా సంపాదిస్తుండగా, ఏకంగా న్యాయవాదికి చెందిన స్థ్దలం ఇదే తరహాలో రి జిస్ట్రేషన్ చేయగా,అతడు దీనిపై చీటింగ్ కేసు పెట్టగా అసలు దొంగలు బయటపడ్డారు.దీంతో సబ్ రిజిస్ట్రార్లు, రాజకీ య నాయకులు భూబాగోతమని తెలిపోయింది. అదేవిధం గా ఎల్‌బినగర్‌లో సర్వే నెం. 9/1లో 15 ఎకరాల భూమి ఉండగా, దానిపై ఇప్పటివరకు 124 మందికి రిజిస్ట్రేషన్లు అ యినట్లు పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టగా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఈభూమిలో తలదూర్చినందుకు రెండేళ్ల కి తం డిసిపి స్థ్దాయి అధికారిపై వేటు పడింది. ఇందులో ఆనియోజకవర్గానికి చెందిన 04 కార్పొరేటర్ల హస్తమున్నట్లు బాధితులు మీడియా సమావేశం పెట్టి ఆరోపణలు చేశారు. లేఅవుట్లలో కొనుగోలు చేస్తున్న ప్లాట్లకు సంబంధించిన వివరాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిశీలించడం లేదు. రోజు ఎన్ని డాక్యుమెంట్లు రి జిస్ట్రేషన్ చేసిన విషయం పరిగణలోకి తీసుకుంటున్నారనే తప్ప డాక్యుమెంట్‌లో పొందుపరిచినప్లాట్ల వివరాలు,దానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లన్నీ సరైనవేనా అన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మధ్యవర్తులు, డా క్యుమెంట్ రైటర్లు తీసుకొచ్చిన పత్రాలను పరిశీలించకుండా నే రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. స్దలాల యాజమానులు డబుల్ రిజిస్ట్రేషన్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Related Posts