YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు

కొంగ ప్రేమ @14000 కిలోమీటర్లు!

కొంగ ప్రేమ @14000 కిలోమీటర్లు!

ఎటువంటి ఆటంకాలు ఎదురైనా ప్రేమ ముందు బలాదూర్ అని నిరూపించింది ఓ కొంగ. బంధాలు, అనుబంధాలుమనుషులకేనా..జంతువులు, పక్షులకుకూడాఉంటాయనినిరూపించింది. ఎటువంటి సందేహం లేదు. సేమ్ ఇలాగే.. ఈ స్టార్క్ కొంగ జాతికే చెందిన ఓ పక్షి మరి దాని ప్రేమ ముచ్చట్లు వింటే...కొన్ని రకాల పక్షులు కాలానికి అనుగుణంగా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి వాటికి అనువైన ప్రాంతంలో నివాసముంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్టార్క్ పక్షులు కూడా వలస పక్షులే కాని.. అవి వాటి అనువైన ప్రాంతం కోసం వలస వెళ్తాయి. కాని.. ఈ వైట్ మేల్ స్టార్క్ మాత్రం తన తోడు కోసం, తన ప్రేయసి కోసం ప్రతి సంవత్సరం దాదాపు 14 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.అలా.. గత నెల చివరి వారంలోనే తన వింటర్ నివాస ప్రాంతమైన సౌత్ ఆఫ్రికా నుంచి ఈస్ట్ యురోపియన్ కంట్రీ క్రొయోషియాకు 14వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చింది. దాని ప్రేయసి మలెనా క్రొయేషియాలోనే నివాసముంటుంది. వేటగాళ్ల ఉచ్చుకు చిక్కిన మలెనా కాలుకు గాయం కావడంతో అది ఎగరలేకపోతుంది. దాన్ని గమనించిన ఓ వ్యక్తి 1993లో దాన్ని అక్కున చేర్చుకున్నాడు. అప్పటి నుంచి దాని బాగోగులు ఆయనే చూస్తున్నాడు. ఇక.. మలెనా ప్రియుడే ఇప్పుడు మనం మాట్లాడుకునే స్టార్క్. పేరు క్లెపెటాన్.ప్రతి సంవత్సరం ఆగస్టులో సౌత్ ఆఫ్రికాకు వలస వెళ్లే క్లెపెటాన్ మళ్లీ మార్చి చివరి వారం వరకు తన ప్రేయసి కోసం క్రొయేషియాకు చేరుకుంటుంది. మళ్లీ ఆగస్టు వచ్చే వరకు వాటికి సపరేట్‌గా ఏర్పాటు చేసిన నెస్ట్‌లో సేదతీరుతాయి. ఇప్పటి వరకు వాటికి 62మంది పిల్లలు పుట్టాయట. ఇంకా.. వాటి సంతానాన్ని వృద్ధి చేయటానికి అవి పాటు పడుతున్నట్లు వాటిని పెంచుతున్న వ్యక్తి చెబుతున్నాడు.

Related Posts