తిరుమల ఆగస్టు 14,
పరకామణి లెక్కింపు కోసం నూతన భవన నిర్మాణానికి టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి భూమి పూజచేసారు. భవన నిర్మాణానికి అయ్యే ఖర్చుని భరించేందుకు తాడేపల్లి గూడెంకు చెందిన మురళి కృష్ణ ముందుకు వచ్చారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల ఆరోగ్యానికి మంచిది కాదు అందుకోసమే నూతన భవన నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆలయంలోని పరకామణి లెక్కింపుకి వచ్చే ఉద్యోగుల వ్యక్తిగత అవసరాలతోపాటు,ఇతర అవసరాలకు ఇబ్బంది పడుతున్నారు. ఆ దిశగా ఆలోచించి ఆలయం వెనుక భాగంలోని ఖాళీ స్థలంలో పరకామణి లెక్కింపు భవనానికి నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు.