ఏలూరు ఆగస్టు 14,
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి నది ఉదృతం గా ప్రవహిస్తోంది. ఇంద్రావతి, శబరి నదుల నుండి వచ్చే వరద తో పోలవరం వద్ద గోదావరిలో వరద పెరిగింది. పోలవరం కాఫర్ డ్యామ్ వద్ద నేడు 26.50 మీ.లు, పోలవరం వద్ద 22 మీ.లు వరద నీటి మట్టం నమోదు అయింది. ప్రాజెక్ట్ దిగువ రివర్స్ లో స్పిల్ ఛానల్, స్పిల్ వే ప్రాంతం లోకి వరదనీరు చేరింది. పోలవరం మండలం కొత్తూరు కాజ్ వే పై 8 అడుగుల మేర వరద నీరు నిలిచింది. పోలవరం ఎగువన ఉన్న 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.