విజయవాడ ఆగస్టు 14,
రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ పదవి నుండి స్వచ్ఛందంగా తప్పుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేసారు. రిటైర్డ్ జస్టిస్ గా చేసిన ఈశ్వరయ్య ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడటం న్యాయవ్యవస్థకే మాయని మచ్చని అయన విమర్శించారు. ఈశ్వరయ్యపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో ఎంక్వైరీకి హైకోర్టు ఆదేశించింది. జడ్జి రామకృష్ణతో జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో తనదేనని పత్రికా విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య ఒప్పుకోవటం గమనార్హం. రిటైర్డ్ జస్టిస్ గా ఉన్న ఈశ్వరయ్య తప్పుడు పిల్స్ దాఖలు చేయించారనే అభియోగాలు కూడా ఉన్నాయని రామకృష్ణ అన్నారు.