విశాఖపట్నం ఆగస్టు 14
స్థానిక ఊర్వశి కూడలి జాతీయ రహదారి పై ప్రయాణిస్తున్న కారులో ఒక్క సారిగా పొగలు వ్యాపించాయి . దింతో అటుగా రాకపోకలు సగిస్తున్న ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఘటనకు సంబంధించి వివరాలు ఇలాఉన్నాయి శుక్రవారం మద్యాహ్నం 12 .30 నిమిషాల సమయంలో ఎన్ .ఏడీ కూడలి నుండి తాటి చెట్లపాలెం జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న కారు ఊర్వశి కూడలి వద్దకి వచ్చే సరికి ముందు భాగంలో ఒక్క సారిగా పెద్ద ఎత్తున పొగ తో కూడిన మంటలు వ్యాపించడంతో గమనించిన కారు డ్రైవర్ కారును జాతీయ రహదారి పై నిలిపి వేశాడు . అటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు అగ్నిమాపక అదికారులకు సమాచారమిచ్చారు . తక్షణం స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసారు . ప్రమాదంలో ప్రాణ నష్టం జరుగక పొవటంతో అంత ఊపిరి పిల్చుకున్నారు .బ్యాటరీ సాట్ సర్క్యుట్ వల్ల మంటలు వ్యాపించివుంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు . ప్రమాదం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో కంచరపాలెం పోలీసు లు చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు .